సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతితో ఆర్కేపిలో రేపు 2కే రన్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతితో ఆర్కేపీలో రేపు 2కే రన్ 

 రన్ ఫర్ యూనిటీ నినాదంలో అందరూ ఆహ్వానితులే..తరలి రండి

-- ఎస్ఐ జి.రాజశేఖర్ ప్రకటన

రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :స్వాతంత్ర్య సమరయోధుడు,స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో 500 లకు పైగా సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషిoచి "భారతదేశ ఉక్కు మనిషి" గా పేరు ప్రఖ్యాతిగాంచిన "సర్దార్ వల్లభాయ్ పటేల్ "150వ జయంతి పురస్కరించుకొని తేది :-31-10-2025 "రన్ ఫర్ యూనిటీ" అనే నినాదంతో రామకృష్ణాపూర్ పోలీసులు ఆధ్వర్యంలో (2కే రన్) నిర్వహిస్తున్నట్లు గురువారం రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే.. 2కే రన్ ప్రోగ్రాంలో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  ఎస్సై ప్రకటించారు.కాగా "జాతీయ ఏక్తా దివాస్" వేడుకలను రామకృష్ణాపూర్ లో పెద్ద ఎత్తున చేపడుతున్న దృష్ట్యా జాతీయ సమైక్యతను చాటిచెప్పే "రన్ ఫర్ యూనిటీ" అనే నినాదం కార్యక్రమాన్ని రామకృష్ణాపూర్ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందనీ పేర్కొన్నారు.ఆ 2K రన్ వివరాలు చూస్తే..శుక్రవారం సమయం:- ఉదయం 06:00 గంటలకు పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం నుంచ 2కే రన్ ప్రారంభం అవుతుందని ివివరించారు.అలాగే పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ఏరియాలో గల హనుమంతుడి విగ్రహం వరకు సంబంధిత రన్ కొనసాగి ముగింపు జరుగుతుందని వెల్లడించారు.ఆ రన్ దూరం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. దాంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్లో గల ప్రజలందరూ,అన్నీ రంగాల ప్రముఖులు,వివిధ శాఖల ఉద్యోగస్తులు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులు.యువతి-యువకులు అందరు అధిక సంఖ్యలో ఈ (2K రన్‌) లో అత్యంత ఉత్సాహంతో హాజరై సంబంధిత 2కే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  కోరారు.

--  సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపం...

సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.వందలాది స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి,దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన అచంచలమైన కృషి, అకుంఠిత దీక్ష ఎప్పటికీ మరువలేనివి.ఆయన దార్శనికత,రాజనీతిజ్ఞత కారణంగానే నేడు మనం చూస్తున్న సమగ్ర భారతదేశం సాధ్యమైంది.ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు,దేశభక్తికి,త్యాగానికి,అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం.ప్రజలందరినీ ఐక్యంగా ఉంచాలనే ఆయన ఆశయం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తోంది. "రన్ ఫర్ యూనిటీ" ద్వారా సర్దార్ పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ,మన దేశ సమగ్రతను,ఐక్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేసుకుందాం. ఆ  (2k రన్‌) లో పాల్గొనడం ద్వారా,మనం సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా,భవిష్యత్ తరాలకు ఐక్యతా సందేశాన్ని అందిద్దాం.అందరూ ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములై, విజయవంతం చేయగలరని ఆర్కేపీ పోలీసుల ద్వారా ఎస్ఐ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి