సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతితో ఆర్కేపిలో 2-కే రన్ చేపట్టిన పోలీసులు



సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతితో ఆర్కేపిలో 2-కే రన్ చేపట్టిన పోలీసులు















జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్....

రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :స్వాతంత్ర్య సమరయోధుడు,భారతదేశంలో 500లకు పైగా సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారతదేశ ఉక్కు మనిషిగా పేరు ప్రఖ్యాతిగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో 2కే రన్ పెద్ద ఎత్తున నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే.."రన్ ఫర్ యూనిటీ" అనే నినాదంతో పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం నుంచి శ్రీ కోదండ రామాలయం చౌరస్తా వరకు ఈరోజు కాగడా చేత పట్టుకొని పోలీసులు క్రీడాకారులు విద్యార్థినిలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పరుగులు తీశారు.ఆ సందర్భంగా రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాజు,తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అజీజ్ మాట్లాడారు.ముఖ్యంగా ఉక్కుమనిషిగా మంచి పేరు ప్రతిష్టలు గొప్ప చరిత్ర కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క గొప్పతనం గురించి వివరించారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాజు,పి.రఘునాథరెడ్డి,గాండ్ల సమ్మయ్య,ఒడ్నాల శ్రీనివాస్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,బిజెపి నాయకులు చారి,దన్సింగ్,సంతోష్,టిఆర్ఎస్ నాయకులు కే.సుదర్శన్ గౌడ్,సీనియర్ క్రీడాకారులు డిప్పు శ్రీనివాస్,ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ ఉప్పలయ్య,పట్టణానికి చెందిన క్రీడాకారులు,సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు,పట్టణ పోలీసులు,రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి