తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు-జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.....
మంచిర్యాల న్యూస్,అక్టోబరు-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.ఆ క్రమంలో చూస్తే..రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఆ నేపథ్యంలోనే అనేక జిల్లాలకు ఆరెంజ్,రెడ్ అలెర్ట్ జారీ చేసింది.ఆదివారం ఆదిలాబాద్,ఆసిఫాబాద్,నిర్మల్,నిజామాబాద్,హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్‌గిరి,వికారాబాద్,సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అలాగే సోమవారం,ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,భూపాలపల్లి,ములుగు,కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,మహబూబాబాద్,వరంగల్,హనుమకొండ,జనగాం,నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.దాంతో ఆ జిల్లాలకు ఐఎండి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.అదేవిధంగా మంగళశారం జయశంకర్ భూపాలపల్లి,కొత్తగూడెం,ములుగు,మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.ఆ ఉరుములు,మెరుపులు,గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.అంతేకాకుండా ఆసిఫాబాద్,మంచిర్యాల,పెద్దపల్లి, వరంగల్,హనుమకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.కాగా ప్రస్తుత సమయంలో ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,నల్గొండ,సూర్యాపేట,జనగాం,సిద్దిపేట,భువనగిరి,రంగారెడ్డి,హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ప్రకటించింది.ఆ తరుణంలో బుధవారం ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్, పెద్దపల్లి,భూపాలపల్లి,ములుగు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.అయితే నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,కొత్తగూడెం,మహబూబాబాద్,వరంగల్,హనుమకొండ,జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది.గురువారం ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.రాజన్న సిరిసిల్ల,నిజామాబాద్,కరీంనగర్,పెద్దపల్లి,కొత్తగూడెం,ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Comments
Post a Comment