మావోయిస్టు అగ్రనేత,సికాస కార్యదర్శి బండి ప్రకాష్ డీజీపీ ఎదుట లొంగి పోయాడు ?
మావోయిస్టు అగ్రనేత,సికాస కార్యదర్శి బండి ప్రకాష్ డీజీపీ ఎదుట లొంగి పోయాడు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్....
హైదరాబాదు న్యూస్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక,అక్టోబరు-28 :మావోయిస్టులు-అగ్ర నేతల లొంగుబాటులోనే మావోయిస్టు పార్టీ కీలక నేత,తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు,సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస )అధ్యక్షుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగి పోయాడు.ఆ క్రమంలో చూస్తే..
45 సంవత్సరాలుగా బండి ప్రకాష్ అలియాస్ రమాకాంత్ (ఆర్ కే )మావోయిస్టు పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టి పని చేశారు.ఆ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ బండి ప్రకాశ్ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు.సింగరేణిలో పని చేయడమే కాకుండా ఆనాటి పీపుల్స్‌వార్ ఉద్యమాలకు ఆకర్షితుడైనాడు.దాంతో 1980లో సింగరేణి కార్మిక సమాఖ్య - సికాసలో ఆయన చేరాడు.అలాగే1988 సంవత్సరంలో బెల్లంపల్లిలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో జైలుకు వెళ్లారు.ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్షను కూడా అనుభవించాడు.పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి,మహమ్మద్ హస్సేన్,ముంజ రత్నయ్య గౌడ్లతో కలిసి ఆ సబ్ జైలు గోడలను బద్దలుకొట్టి మరి తుపాకులతో పాటు చాకచక్యంగా తప్పించుకున్నారు.ఆ విషయం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక రికార్డుగా అయింది.అదేవిధంగా 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాశ్ 2004లో విడుదలయ్యారు.స్వర్గీయ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ ఆయన అడవి బాట పట్టారు.గత 20 సంవత్సరాలుగా బండి ప్రకాశ్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.మావోయిస్ట్ పార్టీలో కీలక వ్యక్తిగా బండి ప్రకాష్ ఈరోజు లొంగిపోయాడు.తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగుబాటు అయ్యాడు.తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో గల మందమర్రికి చెందిన బండి ప్రకాష్ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం కార్యదర్శిగా పని చేసిన కాలంలో ఇన్ఫార్మర్ల గుండెల్లో నిద్రపోయాడు.మావోయిస్ట్ పార్టీ లో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ గా అనేక సంవత్సరాలుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడుగా బండి ప్రకాష్ @ ప్రభాత్ ఉన్నాడు.
Comments
Post a Comment