ఆర్కేపిలో ఇన్ ఫార్మర్ లతో శాంతికి విఘాతం?
రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-24జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కోల్ బెల్టు ప్రాంతమైన ముఖ్యమైన ఏరియాగా పిలువబడే రామకృష్ణాపూర్ పట్టణంలో ఇన్ఫార్మర్లు ఎక్కువైనట్లు తెలుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..స్వార్థం ఎక్కువై,ఓర్వలేని తనం,పైరవీతనంతో ఆ బ్రోకర్లు ఇన్ఫార్మర్లుగా మారుతున్నట్లు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజానీకం చర్చించుకుంటుంది.ప్రధానంగా ఎటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రతి రోజు ఏదో ఒక సాకుతో భజన చేస్తూ పూటగడిపే వాళ్ళ ప్రవర్తన ద్వారానే శాంతికి విఘాతం కలుగుతూ అశాంతికి కారకులు అవుతున్నట్లు పట్టణ ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ నేపథ్యంలోనే ఒకరి మెప్పు పొందడానికి రాజకీయంలో ఇన్ ఫార్మర్ గా అవుతున్నారని ఇంకా పోలీసు అధికారులు తెలుసు అంటూ ఇన్ ఫార్మర్లుగా చలామణి అవుతున్నారని వాళ్ల స్వార్థం కోసం పైరవీలు చేస్తూ బ్రోకర్లుగా మారి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు.కొంతమంది నకిలీలు మాత్రం అదేపనిగా ప్రజలను మభ్యపెడుతూ..అధికారుల చుట్టూ తిరుగుతూ ఓర్వలేకనే కొందరిపై తప్పుడు ప్రచారం సైతం చేస్తూ బురద చల్లుతూ మరకలు సృష్టిస్తున్నట్లు ఆ ఇన్ఫార్మర్లు మట్టిలో కలిసిపోవాలని స్థానిక ప్రజలు శపిస్తూన్నారు.వీటన్నిటికీ కారణం పట్టణంలోని వివిధ ఏరియాలలో గంటల తరబడి మీటింగ్ లు పెట్టుకొని మద్యం సేవిస్తూ ఏలాంటి బాధ్యత లేకుండా ఇన్ఫార్మర్లుగా కొంతమంది ప్రతిరోజు 24 గంటలు ఖాళీగానే ఉంటూ సంబంధిత ప్రభుత్వ,సింగరేణి కార్యాలయాల చుట్టూ సీక్రెట్ గా తిరుగుతూ కోవర్టులుగా పబ్బం గడుపుతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.రాజకీయంలో కూడా జోకుడు పనులు చేస్తూ ఒకరి దగ్గర పేరు సంపాదించుకోవడానికి మెప్పుకోసం మరొకరిపై చెడు ప్రచారం చేయడమే కాకుండా శాంతికి విఘాతం కలిగించే విధంగా శత ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ముఖ్యంగా పట్టణంలో నెలకొన్న సమస్యలు ఆ విషయాలపై సంబంధిత అధికారులు త్వరగా మేలుకోవాలని శాంతికి విఘాతం కలిగించే వ్యక్తులపై దృష్టి పెట్టాలని తమదైన శైలిలో ప్రజానీకం విజ్ఞప్తి చేస్తుంది.


Comments
Post a Comment