Posts

Showing posts from November, 2025

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం-కోట్లలో ఆస్తి నష్టం

Image
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం-కోట్లలో ఆస్తి నష్టం  తెలంగాణలోని కొండగట్టు వద్ద రాత్రి భారీ అగ్నిప్రమాదం -- 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం -- సమ్మక్క జాతర కోసం నిల్వ ఉంచిన సరుకు బూడిద -- కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగిందని అంచనా -- విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక నిర్ధారణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-30: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం కాబడిన కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఆ క్రమంలో చూస్తే..సంబంధిత దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.దాంతో వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి.ఆ సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి వాళ్ల యొక్క దుకాణాల్లో నిల్వ ఉంచారు.ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.ఆ ...

డిసెంబరులో అందరికీ కొత్త ఆధార్ కార్డులు

Image
డిసెంబర్ నుంచి అందరికీ కొత్త ఆధార్ కార్డులు -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్.... జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-29 :UIDAI కొత్త ఆధార్ కార్డు రీడిజైన్-డిసెంబర్‌లో భారీ మార్పులు! ఇది ఎందుకు? ఎలా ఉండబోతోంది?పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది.డిసెంబర్ నుండి కొత్త ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ కొత్త ఆధార్ కార్డు ప్రైవసీ & సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా రూపొందించబడుతోంది. పాత ఆధార్ vs కొత్త ఆధార్ — ప్రధాన తేడాలు కొత్త ఆధార్ కార్డు ఎలా ఉంటుంది? కార్డు పై కేవలం: ✔️ ఫోటో ✔️ QR కోడ్ మాత్రమే కనిపిస్తాయి. పాత ఆధార్‌లో ఉండే ఈ వివరాలు ఇక కనిపించవు ❌ పేరు ❌ ఆధార్ నంబర్ ❌ చిరునామా ❌ పుట్టిన తేదీ ❌ లింగం అంటే కార్డుపై ఎటువంటి వ్యక్తిగత సమాచారం ముద్రిత రూపంలో ఉండదు. QR కోడ్‌లో ఏముంది? కొత్త ఆధార్‌లోని QR కోడ్‌లో… ➡️ పేరు ➡️ ఆధార్ నంబర్ ➡️ DOB ➡️ చిరునామా ➡️ లింగం ➡️ బియోమెట్రిక్ వెరిఫికేషన్ డేటా (ఎన్‌క్రిప్టెడ్ రూపంలో) అన్నీ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. ఈ QR కోడ్‌ను ...

బ్రేకింగ్ న్యూస్- రూ.200 కోట్ల గంజాయి సీజ్

Image
బ్రేకింగ్ న్యూస్- రూ.200 కోట్ల గంజాయి సీజ్ బ్రేకింగ్ న్యూస్- రూ.200 కోట్ల గంజాయి సీజ్ -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది.రూ.200 కోట్ల విలువ చేసే 273 కేజీల గంజాయి సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న ఆ నలుగురు విదేశీయుల వద్ద ఈ గంజాయిని గుర్తించారు.ఆ నలుగురు విదేశీయులతో పాటు 32 మందిని అరెస్ట్ చేశారు.నిందితులు ఎనర్జీ డ్రింగ్ టిన్స్లో గంజాయి నింపి రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.

బిగ్ బ్రేకింగ్ న్యూస్...స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు?

Image
బిగ్ బ్రేకింగ్ న్యూస్...జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్  స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు  జీవో 46 కు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించారని హైకోర్టును ఆశ్రయించిన మాజీ సర్పంచ్..విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు  బీసీలకు 17% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వలేదని,జీవో 46 ప్రకారం అది చట్ట విరుద్ధమని పిటిషన్ దాఖలు చేసిన సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు కేవలం 117 మాత్రమే బీసీలకు కేటాయించారని హైకోర్టుకు తెలిపిన పిటిషనర్  ప్రభుత్వం తరపు న్యాయవాది,పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం...

ఆర్కేపి ఓసిపి ఫేజ్-2లో 3న ప్రజాభిప్రాయ సేకరణ సక్సెస్ చేయాలి

Image
ఆర్కేపి ఓసిపి ఫేజ్-2లో 3న ప్రజాభిప్రాయ సేకరణ సక్సెస్ చేయాలి  మందమర్రి జిఎం ఎన్.రాధాకృష్ణ రామకృష్ణాపూర్ న్యూస్,నవంబరు-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ మెగా ఓసి ఫేస్-2పై డిసెంబర్ 3న సింగరేణి యాజమాన్యం చేపడుతున్న భారీ ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మందమర్రి డివిజన్ జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేపీ మెగాఓసి కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు.ఆ సందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడారు.ఆర్కేపీ మెగా ఓసి పేజ్-2లో చేపడుతున్న ఇంకా ప్రారంభిస్తున్న పనులు దానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా వివరించారు.ఆ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రారంభించడంతో రామకృష్ణాపూర్ ప్రజలకు ఇతర పక్కనున్న గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండయని పేర్కొన్నారు.అలాగే రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే- 4గడ్డ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా సహాయ,సహకారాలు 100 శాతం అందిస్తుందని తెలిపారు.అలాగే పట్...

మంచిర్యాల డిసిసి అధ్యక్షులుగా పి.రఘునాథ్ రెడ్డి

Image
https://journalistdaily.blogspot.com/2025/11/blog-post_22.html Please like share and subscribe journalist daily 24 hours flash News and Tv News. మంచిర్యాల డిసిసి అధ్యక్షులుగా పి.రఘునాథ్ రెడ్డి  https://journalistdaily.blogspot.com/2025/11/blog-post_22.html Please like share and subscribe journalist daily 24 hours flash News and Tv News.  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్,నవంబర్-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ- డిసిసి అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ కు చెందిన సీనియర్ నాయకుడు పిన్నింటి రఘునాథరెడ్డి ఎన్నికయ్యారు.ఆ క్రమంలో చూస్తే.. విద్యార్థి దశ నుంచే ఎన్ ఎస్ యు ఐ 2004 నుంచి 2006 వరకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పని చేశాడు.అలాగే యూత్ కాంగ్రెస్ 2007-12 వరకు డిస్టిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేశాడు.అలాగే 2012-13 వరకు ఏపీసీసీ పోల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ గా పని చేశాడు. అదేవిధంగా 2013 -14 వరకు ఏపీ పీసీసీ సెక్రెటరీగా పనిచేశాడు.2014-2023 వరకు టీపీసీ సి సెక్రటరీగా ...

వైద్య వ్యవస్థను ప్రక్షాళన దిశగా మంచిర్యాల వైద్యులు

Image
వైద్య వ్యవస్థను ప్రక్షాళన దిశగా మంచిర్యాల వైద్యులు మరో ముందడుగు మంచిర్యాల కలెక్టర్,అధికారులకు వినతి పత్రం మంచిర్యాల న్యూస్,నవంబరు-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :వైద్య వ్యవస్థను ప్రక్షాళన దిశగా మంచిర్యాల ప్రముఖ వైద్యులు మరో ముందడుగు వేశారు.ఆ క్రమంలో చూస్తే..డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అధికారులకు క్వాక్ క్లినిక్స్,హాస్పిటల్స్ గురించి గురువారం కలిసికట్టుగా వినతి పత్రం సమర్పించారు.ఆ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)మెడికల్ టాస్క్ ఫోర్స్-హెచ్ ఆర్ డి ఏ సమిష్టిగా మంచిర్యాల కలెక్టర్,జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి(డి ఎం హెచ్ ఓ)సబ్-కలెక్టర్(ఆర్డీవో)లకు ఆరోజు వినతి పత్రం సమర్పించాయి.ఆ వినతి పత్రంలో ముఖ్య డిమాండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.1.క్వాక్ క్లినిక్ల మూసివేత ఎన్ఎంసి చట్టంలోని సెక్షన్లు 34 ఇంకా 54 కింద ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయబడిన క్వాక్ క్లినిక్ ల మీద తక్షణ చర్య తీసుకోవాలి.2.జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఏర్పాటు జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సంస్థ ఏర్పాటు దాంట్లో ఈ  క్రింది వారు ఉంటారు.కలెక్టర్,పోలీసు కమిషనర్,ఐఎంఏ కార్యదర్శి లేదా అధ్యక్షుడు,డిఎంహెచ్వో లు ఉంటారు.ముఖ...

ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో బాల,బాలికలకు జిల్లా-జోనల్ స్థాయి బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు

Image
ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో బాల,బాలికలకు జిల్లా-జోనల్ స్థాయి బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు -  సిఐ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి కమిషనర్ జి.రాజు,ఉమ్మడి జిల్లా ఒలంపిక్ సెక్రెటరీ రఘునాథరెడ్డి ప్రసంగం... రామకృష్ణాపూర్ న్యూస్,నవంబరు-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఎస్ జి ఎఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సౌజన్యంతో అండర్-17,అండర్-14 బాలబాలికలకు బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు గురువారం ప్రారంభించారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లా-జోనల్ స్థాయి ఎంపిక పోటీలు ఈరోజు చేపట్టారు.ఆ క్రీడా పోటీలకు జిల్లా,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడా కారులు హాజరైనారు.ఆ బాస్కెట్బాల్ క్రీడా పోటీలు కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ జి.రాజు,ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ పి.రఘునాథ్ రెడ్డిలు హాజరైనారు.ఆ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి అతిధిలు ప్రసంగించారు.ఆ కార్యక్రమంలో మంచిర్యాల ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎండి.యాకూబ్,వ్...

కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ సక్సెస్-భారీగా తరలివచ్చిన క్రైస్తవులు

Image
 కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ సక్సెస్-భారీగా తరలివచ్చిన క్రైస్తవులు  --  మంచిర్యాల జిల్లా పరిషత్ స్కూల్ పరేడ్ గ్రౌండ్స్ లో చూడచక్కగా వేడుకలు  --  కల్వరి చర్చి నిర్వాహకులు దైవజనులు పి.సతీష్ కుమార్ యేసును గూర్చి సందేశం  --  కార్మిక శాఖ మంత్రి వివేక్,న్యాయమూర్తి శ్రీనివాస్ దంపతులు హాజరు  --  క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేసి యేసు క్రీస్తు ప్రభువు దేవుని జన్మదిన వేడుకలు ప్రార్ధనలతో గొప్పగా జరుపుకున్నారు  మంచిర్యాల న్యూస్,నవంబరు-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు కన్య మరియ గర్భంలో జన్మించిన లోక రక్షకుడు ప్రజల పాపాలను రక్షించడానికి బాల యేసునిగా జన్మించిన యేసు క్రీస్తు ప్రభువు యొక్క క్రిస్మస్ పండుగ వేడుకలను మంగళవారం మంచిర్యాల పట్టణంలో కల్వరి చర్చి ఆధ్వర్యంలో కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్ అత్యంత వైభవంగా భారీ ఎత్తున గొప్ప విశ్వాసంతో ఘనంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..కల్వరి టెంపుల్ నిర్వాహకులు దైవజనులు డాక్టర్ పి.సతీష్ కుమార్ సంబంధిత కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్ వ...

ఓపెన్ జిమ్,స్మశాన వాటికకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్

Image
రామకృష్ణపూర్ న్యూస్,నవంబర్-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధారి వనంలో ఓపెన్ జిమ్,రామకృష్ణాపూర్ లోని స్మశాన వాటికకు మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసారు.క్యాతనపల్లి మున్సిపాలిటీ  20 లక్షల నిధులతో  ఓపెన్ జిమ్ నకు మంత్రి  వివేక్  భూమి పూజ చేసారు.ఆ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో మార్నింగ్ వాక్ లో గాంధారి వనాన్ని విజిట్ చేసినపుడు వాకర్స్ సమస్యలు పరిష్కరిస్తానని ఆ గాంధారి వనం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చానని,అందులో భాగంగా దశలవారీగా అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు.రామకృష్ణాపూర్ ఆర్కే-1 పాత డంప్ యార్డ్ పక్కన 3 ఎకరాల విస్తీర్ణంలో 30 లక్షల మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేయబోయే పట్టణ స్మశాన వాటికకు ఆరోజు మంత్రి శంకుస్థాపన చేసారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ..రామకృష్ణాపూర్ పట్టణానికి స్మశాన వాటిక లేని విషయాన్ని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆ స్థలం కేటాయింపు చేయించి దశబ్దాల కళను నెరవేర్చటం నిజంగా చాలా సంతోషకర విషయమని తెలిపారు....

10-రోజుల్లోనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్‌

Image
10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్‌ -- డిసెంబర్15 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి --  బీసీలకు పార్టీపరంగా 42ు రిజర్వేషన్‌ ఇచ్చేద్దాం  -- క్యాబినెట్‌ భేటీలో సీఎం ప్రతిపాదన  -- అంగీకారం తెలిపిన మంత్రులు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-18:రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతోంది.ఆ క్రమంలో చూస్తే..పది రోజుల్లోనే నోటిఫికేషన్‌ రానుంది.తొలుత గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో ఆ మేరకు కసరత్తు ప్రారంభమైంది.ప్రస్తుతం అమల్లో ఉన్న 23 శాతం బీసీ రిజర్వేషన్‌, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోపు ఉండేలా.. గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రత్యేక కమిషన్‌ను ప్రభుత్వం కోరనుంది.ఈ కమిషన్‌ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి వారం రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ల జాబితా అందిన రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అంటే పది రోజుల్లో గ్రామాల్లో ఓట్ల పండగ ప్రారంభం కానుందన్నమాట.ఈ ఎన్నికలు పార్టీ రహితం అయినప్పటికీ.. పార్టీ తరఫున సర్పంచ్‌, వార్డు అభ్యర్థులుగా పోటీ చేసే వారిలో కనీసం 42ు మంది బీసీలు ఉండాలని,...

నిజానికి మంచి రోజులు అనేవి అసలు ఉన్నాయా?

Image
నిజానికి మంచి రోజులు అనేవి అసలు ఉన్నాయా? మంచి రోజులు  చెడ్డ రోజులు అనేవి లేవు.మనకు మంచి జరుగుతేనే అదే మంచి రోజులు.మనకు చెడు జరుగుతే అదే చెడు రోజులు అని అనుకుంటాం ఇది నిజంకాదు.జీవితంలో ప్రతి మనిషి తరచూ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో...అని ఎదురు చూస్తుంటాడు.ఎవరో ఒకరు మనకు సాయం చేస్తారని,అదృష్టం మన వైపు తిరుగుతుందని,సమయం మారి మనకు వెలుగు చూపుతుందని ఆశిస్తూ ఉంటాడు.కానీ ఒక నిజం మనం గుర్తుంచుకోవాలి.జీవితం అనేది కాలంతో,పరిస్థితులతో మారుతూ ఉండే ఒక ప్రవాహం.ఎండాకాలం,చలికాలం,వర్షాకాలం ఎలా మారుతూ వస్తాయో అలాగే మన జీవితంలో సుఖం..దుఃఖం,లాభం, నష్టం,ఆరోగ్యం అనారోగ్యం వంటి అనుభవాలు కూడా సహజమే.మనం కాలాన్ని ఆపలేము కానీ కాలానికి అనుగుణంగా మనం మారగలము.ఎండాకాలం వస్తే చెప్పులు వేసుకోవాలి,చలికాలం వస్తే దుప్పటి కప్పుకోవాలి,వర్షం వస్తే గొడుగు పట్టుకోవాలి.మనం వాతావరణాన్ని మార్చలేం.కాని మన దుస్తులు,మన శరీరం,మన చుట్టూ వాతావరణాన్ని మార్చుకోవచ్చు.అదే విధంగా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోకుండా,వాటిని అర్థం చేసుకుని పరిష్కారం వెతకడం మన బాధ్యత.ఆకలి వేస్తే తినాలి.నిద్ర వస్తే పడు కోవాలి.ఇవన్నీ సహజమైన జీ...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పార్టీకే పట్టం

Image
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పార్టీకే పట్టం... జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ స్పెషల్... హైదరాబాద్ న్యూస్,నవంబర్-13,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు.ఆ క్రమంలో చూస్తే...తన సమీప అభ్యర్థి(బీఆర్ఎస్)పార్టీకి చెందిన మాగంటి సునీతపై ఆయన విజయం సాధించారు.ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమై అయినప్పటి నుంచి నవీన్ యాదవ్ కు ప్రతి రౌండ్ రౌండ్ కు ఆదిక్యంపెరుగుతూనే ఉంది,జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది.ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది.ఈ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్,25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.మరోవైపు ఎటువంటి ఒక్క రౌండ్ లోను మాగంటి సునీత, అధిక్యం దక్కించుకోలేక పోయారు.ఈ గెలుపు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.ఆ నేపథ్యంలోనే గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు సంబరాలు చే...