ఆర్కేపి ఓసిపి ఫేజ్-2లో 3న ప్రజాభిప్రాయ సేకరణ సక్సెస్ చేయాలి

ఆర్కేపి ఓసిపి ఫేజ్-2లో 3న ప్రజాభిప్రాయ సేకరణ సక్సెస్ చేయాలి 








మందమర్రి జిఎం ఎన్.రాధాకృష్ణ

రామకృష్ణాపూర్ న్యూస్,నవంబరు-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ మెగా ఓసి ఫేస్-2పై డిసెంబర్ 3న సింగరేణి యాజమాన్యం చేపడుతున్న భారీ ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మందమర్రి డివిజన్ జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేపీ మెగాఓసి కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు.ఆ సందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడారు.ఆర్కేపీ మెగా ఓసి పేజ్-2లో చేపడుతున్న ఇంకా ప్రారంభిస్తున్న పనులు దానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా వివరించారు.ఆ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రారంభించడంతో రామకృష్ణాపూర్ ప్రజలకు ఇతర పక్కనున్న గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండయని పేర్కొన్నారు.అలాగే రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే- 4గడ్డ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా సహాయ,సహకారాలు 100 శాతం అందిస్తుందని తెలిపారు.అలాగే పట్టణంలో రోడ్లు అభివృద్ధి ఓవర్ హెడ్ ట్యాంకులు క్లీనింగ్ అమరావాది చెరువు అభివృద్ధి స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఆర్కేపీ మెగా ఓసి భవిష్యత్తు కాలం 18 సంవత్సరాలు ఉంటుందని ఆ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో సుమారు 600 మందికి పైగానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.ఆ నేపద్యంలోనే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.కాగా సంబంధిత ఓపెన్ కాస్ట్ లో 207.87 మి.క్యూ.మీ 31 మార్చి 2024 వరకు తీసినట్లు పేర్కొన్నారు.తీయవలసిన మట్టి 464.26 మి.క్యూ.మీ ఉందన్నారు.అలాగే బొగ్గు/ ఓబిల. నిష్పత్తి ట/క్యూ.మీ 14.21, ఉత్పత్తి సామర్థ్యం 2.5 0 గరిష్టం 3.75 గా ఉందని తెలిపారు.ఆ వెలికి తీయగల బొగ్గు నిల్వలు 32.67 మీ.టన్నులు ఉందన్నారు.మైనింగ్ చేయదలచిన నిలువలు 75.94 మీ.టన్నులు ఉందని పేర్కొన్నారు.నికర భౌగోళిక నిలువలు 143.34 మి.టన్నులు ఉందని బొగ్గు తవ్వక విధానం యాంత్రీకరణ తో యధావిధిగా ఉంటుందని వివరించారు.అయితే తీయవలసిన మొత్తం మట్టి 672.13 మి. క్యూ. మీ.ఉందన్నారు.బొగ్గు సగటు గ్రేడ్ జి 4222 కే సి ఎ ఎల్/కేజీ ఉందని తెలిపారు.ప్రాజెక్టు విస్తీర్ణం మొత్తం1209.249 హెక్టార్లు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 2.5 0 మీ టన్నులు అత్యధికంగా 3.75 మీ.టన్నులు ఉందని తెలిపారు.ముఖ్యంగా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్ తో వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత ప్రారంభిస్తామని పేర్కొన్నారు.ఆ ప్రాజెక్టు కొరకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఫేజ్-2 ఈ ఏడాది డిసెంబర్ 3న నిర్వహిస్తున్నట్లు దానికి అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.పట్టణంలో శిథిలవస్థకు చేరుకున్న సింగరేణి కోటర్లను కూల్చివేత చేయడం జరుగుతుందని అలాగే ఇల్లీగల్ క్వాటర్ల విషయంలో విషయంలో చర్యలు తప్పమన్నారు.అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన అనంతరం అన్నదానం కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఆ  ప్రెస్ మీట్ సమావేశంలో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ,ఎస్ ఓ టు జి ఎం,జి.ఎల్.ప్రసాద్,డీజీఎం(పర్సనల్)సి.హెచ్.అశోక్,పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్,ఎన్విరాన్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి,సెక్యూరిటీ ఆఫీసర్.రవికుమార్,ఆర్కెపిఓసి మేనేజర్ పంకాజ్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి