ప్రజల కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం-మంచిర్యాల డిసిపి భాస్కర్
ప్రజల క్షేమం కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం-మంచిర్యాల డిసిపి భాస్కర్
రామకృష్ణాపూర్ న్యూస్,నవంబర్-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలోనీ అల్లూరి సీతారామరాజు నగర్ లో సోమవారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..సంబదిత ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ హాజరైనారు.దాంతో బెల్ట్ షాప్స్ లలో మద్యం,గుడుంబా కేసులను నమోదు చేసారు.అలాగే సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించి ఆ వాహన యజమానులకు పోలీసులు జరిమానాలు విధించారు.ఆ నేపథ్యంలోనే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో 10-11-2025 రోజున సాయంత్రం 05:00 గంటలకు స్థానిక అల్లూరి సీతారామరాజు నగర్ ఏరియాలో"కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం"చేపట్టారు.ఆ సందర్బంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ..కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమంలో పెద్ద ఎత్తున తనిఖీలు ముమ్మరంగా చేపట్టినట్లు దాంతో సరైన పత్రాలు లేనీ
(31)వాహనాలు పట్టుకొని సంబంధిత యాజమానులకు జరిమానాలు విధించినట్లు గుర్తు చేశారు.అదేవిధంగా బెల్ట్ షాప్స్ ఇంకా గుడుంబా అమ్మకాదరుల ఇండ్లల్లో తనిఖీలు చేయడంతో మద్యం,గుడుంబా పట్టుకుని ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు డిసిపి తెలిపారు.ఆర్కేపీ పట్టణ ప్రజలు మీ యొక్క ఏరియాలు,కాలనీలలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడిన లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసిన మద్యం అమ్మకాలు,గుడుంబా తయారీ అమ్మకాలు,గంజాయి అమ్మకం,సేవించడం లాంటి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసినట్టుగా తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.ఆ తరువాత బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ..పోలీసులు నిత్యం ప్రజారక్షణ కోసం పని చేస్తున్నారని,పట్టణంలో ఎలాంటి సమాచారం ఉన్న లేదా ఏవైనా సమస్యలు ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ నేరాన్ని అదుపులో పెట్టడానికి సహకరించాలన్నారు.అనంతరం స్థానిక అల్లూరి సీతారామరాజు నగర్ లో నివాసం ఉంటున్నా ప్రజలు రామకృష్ణాపూర్ పోలీసులు నిర్వహించిన"కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రాగ్రామ్"వలన అనేక రకాలుగా ప్రజలకు మంచి జరుగుతుందనీ,తమ కాలనీలో నేరాల నియంత్రణ జరిగే అవకాశం ఉన్నదని అలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఆ కార్యక్రమం లో మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ తో పాటు బెల్లంపల్లి ఏసీపీ.రవి కుమార్,మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్,మందమర్రి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు,ఏఎస్సైలు,హెడ్ కానిస్టేబుళ్ళు,పోలీస్ సిబ్బంది,ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.




Comments
Post a Comment