లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి
లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-12: సమాజంలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని,దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందని ఉమ్మడి కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.ఆ క్రమంలో చూస్తే..లంచం అడగడం,తీసుకోవడం,ఇవ్వడం ఈ మూడూ నేరమేనని ఆయన స్పష్టం చేశారు.ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు.ఆ ఫిర్యాదుదారుల పేరు వివరాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని,కేవలం మీ ఒక కాల్‌తో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మన తెలంగాణను స్వచ్ఛంగా,న్యాయంగా,అవినీతి రహితంగా మార్చే బాధ్యత మన అందరిపై ఉందని మంచి సంకల్పంతోనే ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 22 కేసులలో 35 మందిని అరెస్టు చేయగా,ఇందులో రెవెన్యూ (8),పంచాయతీ రాజ్ (6),రిజిస్ట్రేషన్ (3),ఖజానా (3),మున్సిపల్ (3),అగ్రికల్చర్ (3),ఔషధ విభాగం (3),ఆర్టీఏ (3) ఇంకా పోలీస్ (1)శాఖలకు సంబంధించిన కేసులు ఉన్నాయనీ ప్రకటించారు.

Comments
Post a Comment