ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో సంజీవని నూతన ఆంబులెన్స్ ప్రారంభం
ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో సంజీవని నూతన ఆంబులెన్స్ ప్రారంభం
45 లక్షలు వ్యయంతో ఆంబులెన్స్ లో మెరుగైన సౌకర్యాలు
డివైసిఎంఓ డాక్టర్ మధు కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు
రామకృష్ణాపూర్ న్యూస్,నవంబరు-13,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని ఐసియు అంబులెన్స్ ను గురువారం సాయంత్రం ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ మధు కుమార్ రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.ఆ క్రమంలో చూస్తే..దాదాపు 45 లక్షల వ్యాయయంతో కూడిన సంబంధిత సంజీవని అంబులెన్స్ ను ఏరియా ఆసుపత్రిలో కొత్తగా ప్రవేశపెట్టారు.కాగా సంజీవని అంబులెన్స్ లో క్రిటికల్ కు సంబంధించిన కేసులు అలాగే ఎమర్జెన్సీకి సంబంధించిన కేసులు ఇంకా గని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు మెరుగైన వైద్యం అందించడానికి అంబులెన్స్ ఉపయోగకరంగా ఉంటుంది.అంతేకాకుండా ఐసీయులో ఉన్నటువంటి మెరుగైన వైద్య సౌకర్యాలు కూడా ఈ అంబులెన్స్ లో ఉంటాయి.ఆ సందర్భంగా డివైసీఎంఓ డాక్టర్ మధు కుమార్ మాట్లాడుతూ..మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో డివిజన్ జిఎం సూచనలు మేరకు ఏరియా ఆస్పత్రిలో కొత్తగా సంజీవని అంబులెన్స్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.సింగరేణి యాజమాన్యం సింగరేణి ఉద్యోగుల కోసం కార్మికుల కోసం మెరుగైన వైద్య అందించడానికి ఈ సంజీవని అంబులెన్స్ ప్రవేశపెట్టడమే ఒక నిదర్శనమని ఆయన తెలిపారు.ఆ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ మధు కుమార్,సంక్షేమ అధికారి మదార్ సాహెబ్,ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ నాగేంద్ర భట్టు,ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య,అంబులెన్స్ డ్రైవర్లు,ఆసుపత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.








Comments
Post a Comment