నిజానికి మంచి రోజులు అనేవి అసలు ఉన్నాయా?

నిజానికి మంచి రోజులు అనేవి అసలు ఉన్నాయా?

మంచి రోజులు  చెడ్డ రోజులు అనేవి లేవు.మనకు మంచి జరుగుతేనే అదే మంచి రోజులు.మనకు చెడు జరుగుతే అదే చెడు రోజులు అని అనుకుంటాం ఇది నిజంకాదు.జీవితంలో ప్రతి మనిషి తరచూ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో...అని ఎదురు చూస్తుంటాడు.ఎవరో ఒకరు మనకు సాయం చేస్తారని,అదృష్టం మన వైపు తిరుగుతుందని,సమయం మారి మనకు వెలుగు చూపుతుందని ఆశిస్తూ ఉంటాడు.కానీ ఒక నిజం మనం గుర్తుంచుకోవాలి.జీవితం అనేది కాలంతో,పరిస్థితులతో మారుతూ ఉండే ఒక ప్రవాహం.ఎండాకాలం,చలికాలం,వర్షాకాలం ఎలా మారుతూ వస్తాయో అలాగే మన జీవితంలో సుఖం..దుఃఖం,లాభం, నష్టం,ఆరోగ్యం అనారోగ్యం వంటి అనుభవాలు కూడా సహజమే.మనం కాలాన్ని ఆపలేము కానీ కాలానికి అనుగుణంగా మనం మారగలము.ఎండాకాలం వస్తే చెప్పులు వేసుకోవాలి,చలికాలం వస్తే దుప్పటి కప్పుకోవాలి,వర్షం వస్తే గొడుగు పట్టుకోవాలి.మనం వాతావరణాన్ని మార్చలేం.కాని మన దుస్తులు,మన శరీరం,మన చుట్టూ వాతావరణాన్ని మార్చుకోవచ్చు.అదే విధంగా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోకుండా,వాటిని అర్థం చేసుకుని పరిష్కారం వెతకడం మన బాధ్యత.ఆకలి వేస్తే తినాలి.నిద్ర వస్తే పడు కోవాలి.ఇవన్నీ సహజమైన జీవన విధానాలు.వీటిలో మంచి లేదా చెడు అనే తేడా లేదు.అది మన మనసులోని దృష్టి మాత్రమే.మంచి రోజులు అనేది మనలో ఒక ఆశ.కానీ మనం ఆ ఆశలోనే బతుకుతూ..ప్రస్తుతాన్ని కోల్పోతుంటాం.నిజానికి జీవితం యొక్క అందం ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది.మనం మనుషులను అర్థం చేసుకోవాలి,కాలాన్ని అర్థం చేసుకోవాలి,పుట్టడము,మరణము,కర్మలు వాటి ఫలాలు,పాపపుణ్యాలు,పూర్వజన్మ కర్మలు.వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి.ఈ అర్థం కలిగినప్పుడు మనం ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మలచు కోవడం సాధ్యమవు తుంది లేదా జరగవలసింది జరిగింది అని మనం సరి పెట్టుకోవచ్చు.జరగకూడనిది అయితే ఎందుకు జరుగుతుంది.జరిగేది ఉంది కనుకనే జరిగింది అనుకోవాలి.జీవితంలో సంతోషం అంటే అన్ని అనుకూలంగా ఉండటం కాదు.ఏది ఉన్నా దానిలో మనశ్శాంతిని కనుగొన గలగడం.ఎవరూ నిరంతరం సుఖం లేదా దుఃఖంలో ఉండరు.కానీ మనం ఏ స్థితిలో ఉన్నా దానిని అర్థం చేసుకుని స్వీకరించగలిగితే,అదేనిజమైన ఆనందం.కాబట్టి మంచి రోజులు రావాలనే ఎదురు చూడకుండా,ప్రతిరోజూ మన దృష్టిని మార్చుకొని,మన పరిస్థితిని మనకు అనుకూలంగా మలుచుకుంటూ జీవించాలి.మంచి రోజులు ఎన్నటికీ రావు కానీ ప్రతిరోజు మనకు అనుకూలంగా మార్చుకుంటే ప్రతిరోజు మంచి రోజే అని చెప్పడంలో అసలు సందేహం లేదు.

                                                           -----  కలువల శ్రీనివాస్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి