ఓపెన్ జిమ్,స్మశాన వాటికకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్




రామకృష్ణపూర్ న్యూస్,నవంబర్-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధారి వనంలో ఓపెన్ జిమ్,రామకృష్ణాపూర్ లోని స్మశాన వాటికకు మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసారు.క్యాతనపల్లి మున్సిపాలిటీ  20 లక్షల నిధులతో  ఓపెన్ జిమ్ నకు మంత్రి  వివేక్  భూమి పూజ చేసారు.ఆ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో మార్నింగ్ వాక్ లో గాంధారి వనాన్ని విజిట్ చేసినపుడు వాకర్స్ సమస్యలు పరిష్కరిస్తానని ఆ గాంధారి వనం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చానని,అందులో భాగంగా దశలవారీగా అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు.రామకృష్ణాపూర్ ఆర్కే-1 పాత డంప్ యార్డ్ పక్కన 3 ఎకరాల విస్తీర్ణంలో 30 లక్షల మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేయబోయే పట్టణ స్మశాన వాటికకు ఆరోజు మంత్రి శంకుస్థాపన చేసారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ..రామకృష్ణాపూర్ పట్టణానికి స్మశాన వాటిక లేని విషయాన్ని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆ స్థలం కేటాయింపు చేయించి దశబ్దాల కళను నెరవేర్చటం నిజంగా చాలా సంతోషకర విషయమని తెలిపారు.ఆ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, డి ఎఫ్ ఓ శివ ఆశిష్ సింగ్,మాజీ మున్సిపల్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,చైర్మన్ టిపిసిసి సభ్యులు పిన్నింటి రఘనాథ్ రెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు,జిల్లా అధికార ప్రతినిధి వొద్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య,మహంకాళి శ్రీనివాస్,అబ్దుల్ అజీజ్,పనస రాజు,కనకం వెంకటేశ్వర్లు,ఎల్పుల సత్యం,పుల్లూరి కళ్యాణ్,కుర్మ సుగుణాకర్, కట్ల రమేష్,మెట్ట సుధాకర్,బత్తుల వేణు, భైర మల్లేశం,నక్క శ్రీను,మహిళ నాయకురాళ్లు పుష్ప,రాజేశ్వరి, గాంధారి వనం వాకర్స్,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి