ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో బాల,బాలికలకు జిల్లా-జోనల్ స్థాయి బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు
ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో బాల,బాలికలకు జిల్లా-జోనల్ స్థాయి బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు
- సిఐ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి కమిషనర్ జి.రాజు,ఉమ్మడి జిల్లా ఒలంపిక్ సెక్రెటరీ రఘునాథరెడ్డి ప్రసంగం...
రామకృష్ణాపూర్ న్యూస్,నవంబరు-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఎస్ జి ఎఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సౌజన్యంతో అండర్-17,అండర్-14 బాలబాలికలకు బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు గురువారం ప్రారంభించారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లా-జోనల్ స్థాయి ఎంపిక పోటీలు ఈరోజు చేపట్టారు.ఆ క్రీడా పోటీలకు జిల్లా,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడా కారులు హాజరైనారు.ఆ బాస్కెట్బాల్ క్రీడా పోటీలు కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ జి.రాజు,ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ పి.రఘునాథ్ రెడ్డిలు హాజరైనారు.ఆ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి అతిధిలు ప్రసంగించారు.ఆ కార్యక్రమంలో మంచిర్యాల ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎండి.యాకూబ్,వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ బెల్లం శ్రీనివాస్,వ్యాయామ ఉపాధ్యాయులు దుబ్బ శ్రీనివాస్,విజయ్,వహీదా బేగం,సంతోష్,మల్లికా,సీనియర్ క్రీడాకారుడు డిప్పు శ్రీనివాస్,పిటి,పిడీలు,క్రీడాకారులు పాల్గొన్నారు.





Comments
Post a Comment