మంచిర్యాల డిసిసి అధ్యక్షులుగా పి.రఘునాథ్ రెడ్డి
https://journalistdaily.blogspot.com/2025/11/blog-post_22.html
Please like share and subscribe journalist daily 24 hours flash News and Tv News.
మంచిర్యాల డిసిసి అధ్యక్షులుగా పి.రఘునాథ్ రెడ్డి
రామకృష్ణాపూర్ న్యూస్,నవంబర్-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ- డిసిసి అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ కు చెందిన సీనియర్ నాయకుడు పిన్నింటి రఘునాథరెడ్డి ఎన్నికయ్యారు.ఆ క్రమంలో చూస్తే.. విద్యార్థి దశ నుంచే ఎన్ ఎస్ యు ఐ 2004 నుంచి 2006 వరకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పని చేశాడు.అలాగే యూత్ కాంగ్రెస్ 2007-12 వరకు డిస్టిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేశాడు.అలాగే 2012-13 వరకు ఏపీసీసీ పోల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ గా పని చేశాడు. అదేవిధంగా 2013 -14 వరకు ఏపీ పీసీసీ సెక్రెటరీగా పనిచేశాడు.2014-2023 వరకు టీపీసీ సి సెక్రటరీగా పని చేశారు. అంతేకాకుండా 2023 నుంచి టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు.2023 నుంచి టీపీసీసీ మెంబర్ ప్రస్తుతం టిపిసిసి రాష్ట్ర సభ్యులు, ఎల్డిఎం కోఆర్డినేటర్, అదిలాబాద్ ఎస్టి పార్లమెంట్ కాన్స్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.ఆ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ పి రఘునాథరెడ్డి మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులుగా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సమయంలో రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద రాత్రి 9 గంటలకు టపాకాయలు పేల్చి స్వీట్లు తినిపించుకొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.అలాగే మంచిర్యాల జిల్లా కొత్త డిసిసి అధ్యక్షులు పి.రఘునాథరెడ్డికి ఆ పార్టీ శ్రేణులు అభిమానులు స్నేహితులు రాజకీయ పార్టీల నాయకులు అందరు కూడా సోషల్ మీడియా ద్వారా ఇంకా ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా డిసిసి అధ్యక్షులు పి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర ముఖ్యమంత్రి,డిప్యూటీ ముఖ్యమంత్రి,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి,
పెద్దపల్లి ఎంపీ అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
.jpg)


Comments
Post a Comment