కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ సక్సెస్-భారీగా తరలివచ్చిన క్రైస్తవులు
కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ సక్సెస్-భారీగా తరలివచ్చిన క్రైస్తవులు
-- మంచిర్యాల జిల్లా పరిషత్ స్కూల్
పరేడ్ గ్రౌండ్స్ లో చూడచక్కగా వేడుకలు
-- కల్వరి చర్చి నిర్వాహకులు దైవజనులు పి.సతీష్ కుమార్ యేసును గూర్చి సందేశం
-- కార్మిక శాఖ మంత్రి వివేక్,న్యాయమూర్తి శ్రీనివాస్ దంపతులు హాజరు
-- క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేసి యేసు క్రీస్తు ప్రభువు దేవుని జన్మదిన వేడుకలు ప్రార్ధనలతో గొప్పగా జరుపుకున్నారు
మంచిర్యాల న్యూస్,నవంబరు-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు కన్య మరియ గర్భంలో జన్మించిన లోక రక్షకుడు ప్రజల పాపాలను రక్షించడానికి బాల యేసునిగా జన్మించిన యేసు క్రీస్తు ప్రభువు యొక్క క్రిస్మస్ పండుగ వేడుకలను మంగళవారం మంచిర్యాల పట్టణంలో కల్వరి చర్చి ఆధ్వర్యంలో కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్ అత్యంత వైభవంగా భారీ ఎత్తున గొప్ప విశ్వాసంతో ఘనంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..కల్వరి టెంపుల్ నిర్వాహకులు దైవజనులు డాక్టర్ పి.సతీష్ కుమార్ సంబంధిత కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైనారు.దాంతో పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క జన్మదినంకు సంబంధించిన మంచి సువార్తను దేవుని ప్రియులకు,ప్రజలకు ఆయన వివరించారు.ఆ వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అలాగే న్యాయమూర్తి శ్రీనివాస్ దంపతులు కూడా అతిథులుగా హాజరైనారు.ఆ సెలబ్రేషన్ వేడుకలలో ముందుగా దేవుని పాటలతో భక్తి శ్రద్దల మధ్య వేడుకలు పెద్ద ఎత్తున ప్రారంభించారు.అలాగే ఏసుక్రీస్తు ప్రభువు జన్మించిన నాటికను కూడా అక్కడికి వచ్చిన క్రైస్తవ కుటుంబాలకు ప్రజలందరికీ తెలిసే విధంగా మంచిగా ప్రదర్శించారు.ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా అన్ని క్రిస్మస్ సంఘాల నుంచి క్రైస్తవ సోదరీ సోదరులు వాళ్ల యొక్క పిల్లలతో సహా కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో హాజరైనారు.దాంతో ఆ స్కూల్ గ్రౌండ్ లో క్రైస్తవుల జనంతో ఎంతో ఆర్భాటంగా కనిపించింది.అక్కడి గ్రౌండ్లో ఏసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన బైబిలు,సిలువ,ఏసుక్రీస్తుకు దేవునికి సంబంధించిన ప్రేయర్ ఆయిల్ నూతన క్యాలెండర్ ఇంక దేవునికి సంబంధించిన దేవుడు ఆశీర్వదించిన వివిధ రకాలైన వస్తువులను స్టాల్స్ ద్వారా విక్రయించారు.ఆ స్టాల్స్ లో దేవుని ప్రియులు చేరుకొని వాళ్లకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకున్నారు. ఆ సందర్భంగా కల్వరి చర్చి దైవజనులు డాక్టర్ పి.సతీష్ కుమార్ ఏసుక్రీస్తు ప్రభువు దేవుని సందేశమును దేవుని పరిచర్యగా చాలా చక్కగా అందించారు.ప్రజలందరిని రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రభువు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన విషయాలను ఎంతో ఆసక్తిగా మంచిగా గుర్తు చేశారు.ఏసుక్రీస్తు ప్రభువును ప్రతి ఒక్కరూ వాళ్ల యొక్క హృదయాలలో భద్రంగా ఉంచుకోవాలని దాంతో యేసు క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరిని ఆయన పేరుగా ఆశీర్వదిస్తారని పరలోకంలో కూడా చోటు కల్పిస్తారని మంచి సందేశం అందించారు.ఆ నేపథ్యంలోనే దైవజనులు సతీష్ కుమార్ దేవుని పాటలతో మంచి సందేశం తో అక్కడికి చేరుకున్న క్రైస్తవ ప్రియులందరినీ కూడా ఏసుక్రీస్తు ప్రభువు దేవుడు ఆయన ప్రజలందరినీ అక్కడికి వచ్చిన క్రైస్తవ ప్రియులందరినీ కూడా మంచిగా మెండుగా ఆశీర్వదించాలని వాళ్లకు కావాల్సిన ప్రతి అవసరములను కూడా తీర్చాలని ప్రార్థనలు చేశారు.అలాగే దేవుని మార్గంలో నడవాలని దేవుని బిడ్డలుగా మంచిగా ఆదర్శప్రాయంగా మంచి సాక్షిగా జీవించాలని కోరారు.అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ క్రైస్తవులను ఉద్దేశించి వేదికపై ప్రసంగించారు.ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఏసుక్రీస్తు ప్రభువు మార్గంలో నడవాలని ఆ దేవుని దీవెనలు అందరూ మంచిగా పొందాలని తెలిపారు.అందర్నీ కూడా ప్రేమతో పలకరించి ఉండాలని అంత మంచి కార్యక్రమంలో అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరికీ కూడా ముందస్తు కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్ శుభాకాంక్షలు మంత్రి తెలిపారు.ఆ ప్రోగ్రాంకు లక్షల ఖర్చు చేసి అక్కడికి వచ్చిన అందరికీ కూడా మంచిగా అన్ని సౌకర్యాలు కల్పించారు.ఆ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ మంచిర్యాల సేవకులు,జిల్లాలోని వివిధ క్రైస్తవ సంఘాలకు చెందిన పాస్టర్లు క్రైస్తవులు వందలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
.jpg)

















Comments
Post a Comment