వైద్య వ్యవస్థను ప్రక్షాళన దిశగా మంచిర్యాల వైద్యులు
వైద్య వ్యవస్థను ప్రక్షాళన దిశగా మంచిర్యాల వైద్యులు మరో ముందడుగు
మంచిర్యాల న్యూస్,నవంబరు-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :వైద్య వ్యవస్థను ప్రక్షాళన దిశగా మంచిర్యాల ప్రముఖ వైద్యులు మరో ముందడుగు వేశారు.ఆ క్రమంలో చూస్తే..డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అధికారులకు క్వాక్ క్లినిక్స్,హాస్పిటల్స్ గురించి గురువారం కలిసికట్టుగా వినతి పత్రం సమర్పించారు.ఆ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)మెడికల్ టాస్క్ ఫోర్స్-హెచ్ ఆర్ డి ఏ సమిష్టిగా మంచిర్యాల కలెక్టర్,జిల్లా వైద్య అండ్ ఆరోగ్య అధికారి(డి ఎం హెచ్ ఓ)సబ్-కలెక్టర్(ఆర్డీవో)లకు ఆరోజు వినతి పత్రం సమర్పించాయి.ఆ వినతి పత్రంలో ముఖ్య డిమాండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.1.క్వాక్ క్లినిక్ల మూసివేత ఎన్ఎంసి చట్టంలోని సెక్షన్లు 34 ఇంకా 54 కింద ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయబడిన క్వాక్ క్లినిక్ ల మీద తక్షణ చర్య తీసుకోవాలి.2.జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఏర్పాటు జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సంస్థ ఏర్పాటు దాంట్లో ఈ క్రింది వారు ఉంటారు.కలెక్టర్,పోలీసు కమిషనర్,ఐఎంఏ కార్యదర్శి లేదా అధ్యక్షుడు,డిఎంహెచ్వో లు ఉంటారు.ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ నిబంధనల అమలును నిర్ధారించడం ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఐఎంఏ,మెడికల్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఆర్ డి ఏ ఆ ప్రతిపాదనను గట్టిగా వినిపించింది.

Comments
Post a Comment