తెలంగాణలో చలి గజ..గజ ఎక్కువైంది

 తెలంగాణలో చలి పంజాతో గజగజ వణుకు షురూ


జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్ 

మంచిర్యాల న్యూస్,నవంబరు-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :చలికాలం వచ్చేసింది.ఆ క్రమంలో చూస్తే..చలి పులి పంజాతో ఇక నుంచి గజగజ వణకాల్సిందే.తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.ముఖ్యంగా ఉత్తర,పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు-10 నుంచి-12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందన్నారు.ఆ నేపథ్యంలోనే ఆదిలాబాద్,ఆసిఫాబాద్,నిర్మల్,కామారెడ్డి,మెదక్,సంగారెడ్డి, వికారాబాద్,రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్నట్లు తెలిపారు.మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.మంగళవారం ఉదయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,బీహెచ్‌ఈఎల్,పటాన్‌చెరు,రాజేంద్రనగర్,జీడిమెట్ల,కొంపల్లి,మల్కాజ్‌గిరి,కాప్రా,సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు-13 నుంచి-15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.ఆ వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..రాత్రి ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ..కనిష్ఠ తీవ్రత కొంచెం అధికంగా ఉండి పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.అలాగే ఉదయం 4 గంటల ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు.సాధారణంగా నవంబర్ నెలలో పొడి వాతావరణం ఉంటుందని భావించినప్పటికీ..రానున్న రోజుల్లో చలి అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోందన్నారు.నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు చలి తీవ్రత మరింత విపరీతంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

--  చలి నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే 

చలి పులి తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు.ఉష్ణోగ్రతలు తగ్గుతున్నందున ఉన్ని,మందపాటి దుస్తులు,స్వెటర్లు,జాకెట్లు,మఫ్లర్లు,గ్లోవ్స్,సాక్స్ ధరించాలన్నారు.ముఖ్యంగా ఉదయం,రాత్రి వేళల్లో తల,చెవులు,కాళ్లను పూర్తిగా కప్పి ఉంచాలంటున్నారు.ఈ చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా..శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.గోరువెచ్చని నీటిని తరచుగా తాగడం మంచిదనీ వ్యాధి నిరోధక శక్తిని పెంచే పండ్లు,కూరగాయలు,విటమిన్ 'సి'సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలనీ వివరించారు.వేడి వేడి సూప్‌లు,పానీయాలు కూడా ఉపశమనాన్ని ఇస్తాయనీ చిన్నపిల్లలు,వృద్ధులు చలికి త్వరగా ప్రభావితమవుతారనీ గుర్తు చేశారు.వారిని ప్రత్యేకంగా వెచ్చగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే రూమ్ హీటర్లను ఉపయోగించండి కానీ గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు.

--  పెరుగుతున్న చలి తీవ్రత-వాతావరణ శాఖ  హెచ్చరికలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు,ఆసిఫాబాద్ లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..నేటి(మంగళవారం) నుంచి మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అనేక జిల్లాల్లో కనిష్ఠంగా 9-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని  ప్రకటించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి