కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం-కోట్లలో ఆస్తి నష్టం
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం-కోట్లలో ఆస్తి నష్టం
-- 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం
-- సమ్మక్క జాతర కోసం నిల్వ ఉంచిన సరుకు బూడిద
-- కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగిందని అంచనా
-- విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక నిర్ధారణ
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-30: తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం కాబడిన కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఆ క్రమంలో చూస్తే..సంబంధిత దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.దాంతో వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి.ఆ సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి వాళ్ల యొక్క దుకాణాల్లో నిల్వ ఉంచారు.ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.ఆ ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.తమ కళ్లెదుటే సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఆ నేపద్యంలోనే వాళ్ల యొక్క రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కాగా మల్యాల,ధర్మపురి సీఐలు రవి,రాంనర్సింహారెడ్డి అక్కడి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Comments
Post a Comment