ఆర్కేపి మెగా ఓసి ఫేజ్-2పై ప్రజాభిప్రాయ సేకరణ హోరాహోరీగా సాగింది


ఆర్కేపి మెగా ఓసి ఫేజ్-2పై ప్రజాభిప్రాయ సేకరణ హోరాహోరీగా సాగింది 

- 48 మంది అభిప్రాయాలు వ్యక్తం చేసిన వైనం.. 

- 46 వినతి పత్రములను అధికారులకు అందించారు 

- ఆర్కే-4 గడ్డలోని 350 కుటుంబాలకు ఉద్యోగం,ఇల్లు,నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి 

- ర్యాలీగా తరలివచ్చిన ఓపెన్ కాస్ట్ బాధిత కుటుంబాలు 

- మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య,పర్యావరణ శాఖ ఇంజనీర్ లక్ష్మణరావు ప్రసాద్ విచ్చేశారు 

-  పోలీసు అధికారులు,సింగరేణి ఎస్ అండి పిసి భారీ ఎత్తున బందోబస్తు 

- నాలుగున్నర గంటలు పాటు కంటిన్యూగా సాగిన ప్రజాభిప్రాయ సేకరణ

- ఆ ప్రజాభిప్రాయ సేకరణలో నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ప్రకటన

రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబర్-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేపీ మెగా ఓసి ప్రాజెక్టు ఫేజ్ -2 యొక్క పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రాంను బుధవారం సింగరేణి యాజమాన్యం పెద్ద ఎత్తున నిర్వహించింది.దాంతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ హోరా హోరీగా సాగింది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి కాంట్రాక్ట్ ఓసి ఓబీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.ఆ ప్రోగ్రాంకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు,వివిధ సింగరేణి కార్మిక సంఘం నాయకులు పట్టణంలోని ప్రజలు ఆర్కే నాలుగు గడ్డ ప్రాంతానికి చెందిన సంబంధిత బాధిత కుటుంబాలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.కాగా ఉదయం ప్రారంభమైన ఆ ప్రజాభిప్రాయ సేకరణ సుమారు నాలుగు గంటల వరకు నిరంతరం హార్ట్ టాపిక్ గా కొనసాగింది.ఆ ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 47 మంది వాళ్ల యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేశారు.అలాగే 44 మంది బాధితులు వాళ్ళ యొక్క సమస్యలపై వినతి పత్రంలో అందించారు.ఆ ప్రజాభిప్రాయ సేకరణకు మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ఇంజనీర్ లక్ష్మణరావు ప్రసాద్ లు హాజరైనారు.దాంతో ప్రజాభిప్రాయ సేకరణలో అందరి అభిప్రాయాలను వాళ్లు తెలుసుకున్నారు.ప్రధానంగా చూస్తే..ఆర్కేపీ మేగాఓసి పేజ్-2పై సింగరేణి యాజమాన్యం చేపడుతున్న పనులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఆ ఓసి పేజ్-1ను 2012లో ప్రారంభించిన కూడా సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ముక్తకంఠంతో అందరు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయలు వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే మేల్కొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఆ ఓపెన్ కాస్ట్ లో బాంబు బ్లాస్టింగ్ వల్ల ఆర్కే నాలుగు గడ్డ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఆరోగ్యాలు చెడిపోయి వాళ్లు ఉంటున్న ఇల్లు కూడా కూలిపోయి దుమ్ము ధూళి ఎక్కువ ఆర్థికంగా అనారోగ్యపారంగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్న కూడా సింగరేణి యాజమాన్యం ఒక్కరోజు కూడా పలకరించింది లేదని ఇచ్చిన హామీలు నెరవేర్చే లేదని తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.వెంటనే బాధిత 350 కుటుంబాలకు ఉద్యోగం కల్పించడంతోపాటు ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వాలని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే రామకృష్ణాపూర్ లో అభివృద్ధి కోసం సింగరేణి సంబంధించిన సీఎంఆర్,డిఎంఎఫ్టి నిధులు కేటాయించాలని ఆ నిధులు బయటకు వెళ్లకుండా ఆ నిధులలో కనీసం 20 శాతం ఖర్చు చేసిన కూడా బాధితులకు సహాయం అందడంతో పాటు రామకృష్ణాపూర్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.అదేవిధంగా మూతపడిన ఆర్కే ఒకటి ఏ గని వద్ద గల సమ్మక్క సారలమ్మ జాతరకు ఆ ఓపెన్ కాస్ట్ విస్తరణతో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. సింగరేణి యాజమాన్యం చేపడుతున్న ఓసీలకు వ్యతిరేకం కాదు కానీ యాజమాన్యం ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు. పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అందరికీ వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.ఆ నేపథ్యంలోనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని తెలిపారు.అంతేగాక పట్టణంలో బీటీ రోడ్లు స్ట్రీట్ లైట్లు తాగునీరు సాగునీరు అందించాలని అమరావాది,క్యాతనపల్లి,దొరగారి పల్లి చెరువులకు పూడికలు తీసి అభివృద్ధిలో తీసుకువెళ్లాలని కోరారు.పట్టణంలోని మసీదులు,దేవాలయాలు,చర్చిలకు పట్టాలు ఇవ్వాలని కోరారు.రామకృష్ణపూర్ కు పూర్వ వైభవం రావాలంటే ఓపెన్ కాస్ట్ కు అసలు వ్యతిరేకం కాదని పట్టణ అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని పట్టణంలోని ఠాగూర్ స్టేడియంను మరింత అభివృద్ధిలో తీసుకువెళ్లాలని తెలిపారు.ఆ ప్రజాభిప్రాయ సేకరణకు బెల్లంపల్లి సబ్ డివిజన్లోని పోలీసులు అలాగే సింగరేణి ఎస్ అండ్ పిసి సిబ్బంది పెద్దఎత్తున ఉద్యోగరీత్యా బందోబస్తు నిర్వహించారు.ఆ ప్రోగ్రాంకు ఆర్కే ఫోర్ గడ్డకు చెందిన బాధిత కుటుంబాలు ముందుగా ర్యాలీగా తరలివచ్చి వాళ్లకు న్యాయం చేయాలని సింగరేణి యాజమాన్యం సహాయం అందించాలని నిరసనలు తెలిపారు.ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆ ప్రజాభిప్రాయ సేకరణ చాలా రసవత్తరంగా సాగింది.రాజకీయ పార్టీల నాయకులు సింగరేణి కార్మిక సంఘం నాయకులు చేరుకొని వాళ్ల యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఆర్కేపిఓసి ప్రాజెక్టు ఫేజ్ -2కు ఎవరు కూడా వ్యతిరేకం కాదని సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని లేనియెడల ఆందోళనలు కూడా ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.అనంతరం మందమర్రి జిఎం ఎన్.రాధాకృష్ణ,మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్యలు అక్కడికి వచ్చిన ప్రజలందరిని కూడా ఉద్దేశించి మాట్లాడారు.ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అందరి అభిప్రాయాలను పక్కాగా రికార్డు చేసినట్లు తెలిపారు.దాంతో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను పంపిస్తామని బాధితులకు తగిన సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తామని ప్రకటించారు.ఆ ప్రజాభిప్రాయ సేకరణలో సుమారు నలబై ఏడు మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేశారు అలాగే నలబై ఆరు మంది బాధితుల యొక్క వినతి పత్రాలను అడిషనల్ కలెక్టర్,పర్యావరణ శాఖ అధికారికి సమర్పించారు.ఆ కార్యక్రమంలో మందమర్రి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ,మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య,పర్యావరణ శాఖ నిజామాబాద్ ఇంజనీర్ లక్ష్మణరావు ప్రసాద్,బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి,ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,మందమర్రి తహసిల్దార్ పీ.సతీష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,ఎండి.అబ్దుల్ అజీజ్,సిపిఐ జిల్లా పట్టణ కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్,మిట్టపల్లి శ్రీనివాస్,ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,అక్బర్ అలీ,హెచ్ఎంఎస్ నాయకులు పార్వతి రాజిరెడ్డి,జక్కుల శ్రీనివాస్,ఐఎన్టియుసి నాయకులు కాంపల్లి సమ్మయ్య,బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్,మేడిపల్లి సంపత్,బిజెపి నాయకులు బంగారు వేణుగోపాల్, సిపిఎం నాయకులు ఎస్.వెంకటస్వామి,బిఎంఎస్ నాయకులు రమేష్,మందమర్రి ఏరియాలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు,పట్టణానికి చెందిన ప్రజలు,పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి