ఆర్కేపిలో డిసెంబర్ 26న సిపిఐ బహిరంగ సభను సక్సెస్ చేయండి


ఆర్కేపిలో డిసెంబర్ 26న సిపిఐ బహిరంగ సభను సక్సెస్ చేయండి 

ఆర్కేపిలో డిసెంబర్ 26న సిపిఐ బహిరంగ సభను సక్సెస్ చేయండి 

- మంచిర్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబరు-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు.ఈనెల 26న సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలో భారీ ఎత్తున బహిరంగ సభ  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆ సభకు ప్రజాసంఘాల శ్రేణులు పార్టీ నాయకులు కార్మికులు కర్షకులు సానుభూతిపరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఆ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలి వస్తున్నట్లు దాంతో ఆ సభకు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆర్ కే పి ఓ సి ఫేజ్-2 ప్రాజెక్ట్ పై సింగరేణి యాజమాన్యం,అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ(పబ్లిక్ హియరింగ్) నిర్వహిస్తున్నట్లు ఆ ప్రాజెక్టు వలన రామకృష్ణాపూర్ లో ఉన్న ప్రజలకు కాలనీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రాజెక్టును అడ్డుకుంటామని తెలిపారు.గతంలో ఓసి వలన ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంత నివాసులు దుమ్ము ధూళి కాలుష్యంతో చాలా ఇబ్బందులు పడి బ్లాస్టింగ్ వలన ఇండ్లు కూడా పగుళ్ళు వచ్చి కూలిపోయినట్లు గుర్తు చేశారు.అనారోగ్యాలకు గురై కొందరు చనిపోవడం జరిగిందని ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంత నివాసులకు నష్టపరిహారం ఇచ్చి పున:రావాసం కల్పించాలని కోరారు.అదేవిధంగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ రామకృష్ణాపూర్ కు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి అభివృద్ధి పనులు సిసి రోడ్లు డ్రైనేజీలు బోర్వెల్స్ ఏరియా డెవలప్మెంట్ కొరకు డి ఎం ఎఫ్ టి,సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని  డిమాండ్ చేశారు.గతంలో కూడా ఓసి ప్రారంభ సమయంలో ఏరియా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మాట చెప్పారని వివరించారు.ఈ దఫా ఆ విధంగా చేస్తే..సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోరాటం చేయక తప్పదనీ హెచ్చరించారు.ఆ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు,మిట్టపల్లి శ్రీనివాస్ సిపిఐ పట్టణ కార్యదర్శి,జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు,వనం సత్యనారాయణ,కాదండి సాంబయ్య,నక్క వెంకటస్వామి,ఏగుడ మొండి,నాయకులు ఈరవేణి రవీందర్,మామిడాల సత్యనారాయణ,బోయ పోతుల కొమురయ్య,తోకల రాజన్న,మురళి,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి