పంచాయితీ ఎన్నికలతో తెలంగాణలో వైన్ షాపులు బంద్-3 విడతల్లో మద్యం నిషేధం
పంచాయితీ ఎన్నికలతో తెలంగాణలో వైన్ షాపులు బంద్- 3 విడతల్లో మద్యం నిషేధం
డిసెంబరు-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్:తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలపై అధికారులు కఠినంగా నిషేధం విధించారు.ఆ క్రమంలో చూస్తే..పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి ఉద్రిక్తతలు,అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
-- మొదటి విడత: డిసెంబర్ 9 నుంచి నిషేధం
డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి,డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి
పోలింగ్ ముగిసి,ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు తొలి విడత ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,236 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.
-- రెండవ విడత: డిసెంబర్ 12–14 వరకు
డిసెంబర్ 14న జరిగే రెండవ విడత పోలింగ్ కోసం..డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14 ఫలితాలు వచ్చేంత వరకు ఆయా గ్రామాల్లో మద్యం నిషేధం అమలు ఉంటుంది.
-- మూడవ విడత: డిసెంబర్ 15–17 వరకు
మూడవ విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి.డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 17 ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆ ప్రాంతంలోని అన్ని వైన్ షాపులు,బార్లు పూర్తిగా మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు.
-- బార్లు, రెస్టారెంట్లు మీద కూడా ఆంక్షలు
ఈ నిషేధం కేవలం వైన్ షాపులకే పరిమితం కాదు.బార్లు,మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు ఈ నిషేధానికి లోబడి ఉంటాయని కలెక్టర్లు స్పష్టంగా తెలియజేశారు.
-- ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎవరైనా దుకాణాలు దొంగచాటుగా మద్యం విక్రయించినా లేదా నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఎన్నికల ప్రాంతాల్లో నిఘాను మరింత వేగం పెంచినట్లు వెల్లడించారు.
-- ఎన్నికలకు చాలా ఉత్సాహం...
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు,అభ్యర్థులు చాలా ఎక్కువ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలతో గ్రామాల భవిష్యత్తు రూపుదిద్దుకోనుంది.ఆ పోలింగ్ జరిగిన రోజే సాయంత్రం ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments
Post a Comment