ఆర్కేపి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద సుల్తాన్ శ్రీనివాస్ మృతి
ఆర్కేపి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద సుల్తాన్ శ్రీనివాస్ మృతి
ఎస్ఐ జి.రాజశేఖర్ కేసు ధర్యాప్తు
రామకృష్ణాపూర్ న్యూస్,డిసెంబరు-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ నగర్ కు చెందిన సుల్తాన్ శ్రీనివాస్(48)అనే లేబర్ వ్యక్తి పట్టణంలోని అంబేద్కర్ అంగడి బజార్ ముందుగల ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కేట్ కన్స్ట్రక్షన్ వద్ద శుక్రవారం మృతి చెంది ఉండటం కనిపించింది.అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఆ మృతుడు అక్కడి ప్రదేశంలో 
శవమై కనిపించాడు.అతని నోటిలో నుంచి నురుగు వచ్చి ఉంది.అతని తలకు రక్తం మరకలు కూడా ఉన్నాయి.కాగా మృతి చెందిన శ్రీనివాస్ ప్రతినిత్యం మద్యం సేవించేవాడని తెలిసింది.
ఆ మేరకు ఆర్కేపి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ అక్కడి సంఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసుకొని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.మృతి చెందిన శ్రీనివాస్ భార్య పట్టణంలోని సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తుంది.ఆ మృతుడికి భార్య,కొడుకు,కూతురు ఉన్నారు.
Comments
Post a Comment