Posts

Showing posts from October, 2025

బిసి రిజర్వేషన్లు..సుప్రీం సంచలన తీర్పు?

Image
బిసి రిజర్వేషన్లు..సుప్రీం సంచలన తీర్పు? హైదరాబాద్ న్యూస్,అక్టోబరు-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది.ఆ క్రమంలో చూస్తే..బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించింది.తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా.?అని అడిగింది.రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నఈ పిటిషన్‌‌ ను విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివేసింది.అయితే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జీవో 9 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఇవాళ(సోమవారం)విచారణ జరిగింది.ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క,పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి హాజరయ్యారు.