Posts

Showing posts from June, 2025

జర్నలిస్టు టీవీ వార్తకు స్పందన..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్లు వేశారు

Image
జర్నలిస్టు టీవీ వార్తకు స్పందన..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్లు వేశారు  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్  రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఆనుకొని ఉన్న రామకృష్ణాపూర్ పట్టణంలో గల క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై సోమవారం స్పీడ్ బ్రేకర్లు వేశారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి ఇటీవల కాలంలోనే ప్రారంభించారు.ప్రధానంగా చూస్తే...క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్థలంలో రోడ్డు క్రాస్ ఎక్కువగా ఉండటంతో పాటు డౌన్ ఎక్కువగా ఉండటం చేత రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంచిర్యాల కలెక్టర్తో పాటుగా ఆర్ అండ్ బి అధికారుల దృష్టికి జర్నలిస్టు టీవీ పత్రిక తీసుకువెళ్లడం జరిగింది.దాంతో వెంటనే స్పందించిన సంబంధిత అధికారులు వెంటనే క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా ప్రమాద హెచ్చరిక బోర్డులు అమర్చారు.ఆ తర్వాత మళ్లీ జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఛానల్ తప్పకుండా రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయాలి ఇంకా వెంటనే బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు కూడా పెట్టాలని మరొకసారి వార్త...

అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో యోగ

Image
అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో యోగ  ఈ నెల 21న-11వ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు  సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 21 వరకు యోగ ప్రోగ్రాంలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక : సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఉదయం యోగ టీచర్ శైలజ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం అత్యంత శ్రద్ధతో చక్కగా నిర్వహించారు.సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న సంబంధిత కార్యక్రమాలలో భాగంగా 11వ అంతర్జాతీయ దినోత్సవ యొక్క వేడుకలు ఈనెల 21న నిర్వహిస్తారు.దాంతో ఈనెల 16 నుంచి 21 తేదీ వరకు ఈ యోగా వేడుకలు చేపడుతున్నారు.కాగా ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన యోగాలో ఆస్పత్రి ఉద్యోగ సిబ్బంది అందరూ కూడా కలిసి యోగా విన్యాసాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డివైసిఎమ్ఓ ప్రసన్నకుమార్,సంక్షేమ అధికారి,డాక్టర్లు,నర్సులు,వార్డు బాయిలు,ఉద్యోగ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై వీధి దీపాలు-స్పీడ్ బ్రేకర్లు వెంటనే వేయాలి

Image
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్...  

ఒకే దేశం-ఒకే ఎన్నిక-2029లో తెలంగాణలో జమీలి ఎన్నికలు?

Image
ఒకే దేశం-ఒకే ఎన్నిక-2029లో తెలంగాణలో జమీలి ఎన్నికలు దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలి ప్రక్రియ 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్‌సభ ఎన్నికలు 2034 నాటికి మిగతా రాష్ట్రాలనూ కలిపి జమిలి 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ రాజకీయ పార్టీలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలనూ స్వీకరిస్తున్న కమిటీ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్.... హైదరాబాద్‌,జూన్‌ 16: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు..ఈసారి లోక్‌సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఐతే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా..రెండు దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తోంది.అంటే.. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించాలని, అనంతరం 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలత...

ములుగు డిఇఓ పాణిని15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు?

Image
ములుగు డిఇఓ పాణిని15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు  --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ ములుగు న్యూస్,జూన్-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక: ములుగు జిల్లాలో ఒక ఉపాధ్యాయుని వద్దనుంచి రూ.15000/- లంచం తీసుకుంటూ సోమవారం డిఇఓ పాణిని ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఆ క్రమంలో చూస్తే..రూ.5000/- రూపాయలు లంచం తీసుకుంటూన్నా జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కూడా ఏసీబీకి చిక్కాడు.అయితే ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆర్కేపిలో పర్యటించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ కు ఘనంగా స్వాగతం

Image
ఆర్కేపిలో పర్యటించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ కు ఘనంగా స్వాగతం ఏరియా ఆసుపత్రి వద్ద సింగరేణి కార్మికుని విగ్రహం ఆవిష్కరణ  పట్టణంలో భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు  మంత్రిగా ఎక్కువ నిధులు తీసుకువచ్చి రామకృష్ణాపూర్ అభివృద్ధికి మరింత ఎక్కువగా కృషి చేస్తానని మంత్రి ప్రసంగం... --   జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో నూతన రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం సాయంత్రం పర్యటించారు.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఆ సందర్భంగా రెండు క్రేన్ వాహనంల ద్వారా డిజె సాంగ్స్ ఇంకా బ్యాండ్ మేళాల మధ్య భారీ ఎత్తున గజ పూలమాలను మంత్రికి సమర్పించారు.అలాగే పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి సంతోషంగా మంత్రికి ఆహ్వానం పలికారు.అనంతరం ఏరియా ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సింగరే...

గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు

Image
గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు ---  గద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం ---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.... హైదరాబాదు న్యూస్,జూన్-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ ఆలోచ‌న‌లు, ఆయ‌న ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది.ఆ క్రమంలో చూస్తే..ఫౌండేష‌న్‌కు అవ‌స‌ర‌మైన నిధులు కేటాయిస్తామ‌ని గ‌తంలో జ‌రిగిన గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆ మేర‌కు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా,సాంస్కృతిక శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.అయితే తెలంగాణ ఉద్య‌మం,సాంస్కృతిక రంగంపై త‌నదైన ముద్ర వేసిన గ‌ద్ద‌ర్ సేవ‌ల‌కు గుర్తింపుగా ఆయ‌న జ‌యంతిని రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా జ‌రుపుతోంది. ఇక ముందు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల  కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లోనూ గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తూ మ‌రో ఉత్త‌ర్వును ప్ర‌భుత్వం జారీ చేసింది.

విమానం దారుణంగా కుప్ప కూలింది- ఆ విమానంలో 242 ప్రయాణికులు

Image
విమానం కుప్ప కూలింది- ఆ విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ సమయంలోనే పరిస్థితి చేయి దాటింది- క్షణాల్లో భస్మీపటలం: పైలెట్ నుంచి చివరి సందేశం ఇదే.. -   జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ న్యూస్.. అహ్మదాబాద్ లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓక విమానం కుప్పకూలింది. అది- ఎయిరిండియాకు చెందిన విమానంగా ప్రాథమిక సమాచారం అందుతోంది.ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు,సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది.ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది.ఆ సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ-అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 ఫ్లైట్ అది. గట్విక్ ఎయిర...

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కు కళ్లు చెదిరే ఆస్తులు

Image
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కు కళ్లు చెదిరే ఆస్తులు.... పదవిని అడ్డం పెట్టుకుని వందల కోట్లు కూడబెట్టిన నూనె శ్రీధర్‌ విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య భవనాలతో పాటు 16 ఎకరాల వ్యవసాయ భూమి ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులు, అరెస్టు చేసిన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారి --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ న్యూస్.. నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శ్రీధర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌లో ఒక విల్లా, షేక్‌పేటలో ఫ్లాట్‌, అమీర్‌పేటలో వాణిజ్య భవనంతో పాటు కరీంనగర్‌లో మూడు ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో 3 ఇండిపెండెంట్‌ ఇళ్లు,16 ఎకరాల వ్యవసాయ భూమి, వివిధ ప్రాంతాల్లో మరో 19 ఓపెన్‌ ప్లాట్లు శ్రీధర్‌ పేరు మీద ఉన్నట్లు తేలింది. వీటిత...

💥బిగ్ బ్రేకింగ్ న్యూస్..మంత్రులకు శాఖలు కేటాయింపు💥

Image
💥బిగ్ బ్రేకింగ్ న్యూస్..💥మంత్రులకు శాఖలు కేటాయింపు*💥 *_♦️కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు? ఆ వివరాల్లోకి వెళితే... ♦️గడ్డం వివేక్ - కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు ♦️వాకిటి శ్రీహరి - పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు ♦️అడ్లూరి లక్ష్మణ్ - ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు అప్పగించినట్లు తెలిసింది.

కాలేశ్వరంపై కేసిఆర్ కమిషన్ విచారణ ముగిసింది

Image
కేసిఆర్ కమిషన్ విచారణ ముగిసింది -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... హైదరాబాదు న్యూస్,జూన్-11,హైదరాబాద్ :బి ఆర్కే భవన్ లో కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఎదుట బుధవారం మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ విచారణ ముగిసింది.ఆయనను పీసి ఘోష్,50 నిమిషాలుపాటు విచారించింది.ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక ప్రశ్నలు సంధించిన115వ సాక్షిగా ఆయన్ను విచారించింది.ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసా గింది.ఆ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు.ఆ విచారణ సందర్భంగా తాగునీరు,సాగునీటి సమస్యలు,వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు అలాగే భారత దేశంలో నీటి లభ్యత,విని యోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు కేసీఆర్ అందించారని సమాచారం.అంతేగాక చాలావరకు డాక్యు మెంట్లు కూడా కమిషన్‌కు ఆయన సమర్పించారు.ఆ విచారణ అనంతరం కేసీఆర్ జస్టిస్ ఘోష్ కార్యాలయానికి వెళ్లి..నేటి విచారణలో ఇచ్చిన సమాధానాలను పరిశీలించి వాటిపై సంతకాలు చేసారు.ఆ విచారణలో వన్ టూ వన్ విధానాన్ని అనుసరించడంపై కొన్ని విమర్శలు వచ్చినా, కమిషన్ వర్గాలు దానిపై స్పందించాయి.కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగోలేకపోవడ...

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి

Image
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి మంచిర్యాల న్యూస్,జూన్-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లో గల మంచిర్యాల క్లబ్ లో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ఎట్టకేలకు ముగిశాయి.ఆ క్రమంలో చూస్తే.. క్రీడాపోటీల అనంతరం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వరూప హాస్పిటల్స్ డాక్టర్ శరత్ బాబు హాజరయ్యారు.అతిథులుగా మంచిర్యాల క్లబ్ ట్రెజరర్ పురుషోత్తం జాజు, ఎస్ టి పి పి డి జి యం పంతుల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్ బండ మీనా రెడ్డి లు హాజరైనారు.అనంతరం విన్నర్స్, రన్నర్స్ కు మెడల్స్ అందజేశారు.ఆ సందర్భంగా డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించడానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ..జిల్లా స్థాయి చాంపియన్షిప్ పోటీలకు హాజరైన క్రీడాకారులందరిక...

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ కు ఆర్కేపీ కాంగ్రెస్ శుభాకాంక్షలు

Image
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకట స్వామికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాదులో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర మంత్రి వివేక్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్కేపీ అధ్యక్షుడు పల్లె రాజు,క్యాతనపల్లి పుర:మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ పనాస రాజు,సీనియర్ నాయకులు ఎండి.అబ్దుల్ అజీజ్,గాండ్ల సమ్మయ్య,గోపు రాజం,కట్ల రమేష్, బొద్దుల ప్రేమ్ సాగర్ లు,తదితరులు ఉన్నారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..ఆర్కేపీ పట్టణంలో నెలకొన్న అనేక సమస్యలు,అభివృద్ధి పనులు,ఇంకా ప్రభుత్వ పథకాలపై ఆ పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.

వరంగల్ జిల్లాలో ఓక వ్యక్తికి కరోనా కలకలం?

Image
వరంగల్ జిల్లాలో ఓక వ్యక్తికి కరోనా కలకలం.. వరంగల్ జిల్లా న్యూస్,జూన్-9, జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:వరంగల్ ఎంజీఎం సమీపంలో ఓక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరుగురికి కరోనగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..గత మూడు రోజులుగా దగ్గు జలుబు జ్వరంతో  బాధపడుతున్నట్లు తెలుస్తుంది.దాంతో అనుమానం వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ను ఆశ్రయించడంతో అక్కడ టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం.ఆ సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిసింది.

టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..డీటెయిల్స్ ఇవిగో!

Image
టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు.. డీటెయిల్స్ ఇవిగో! టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి కొత్త హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 627 కిలోమీటర్ల ప్రయాణం టాటా లైనప్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తున్న ఏకైక మోడల్ జూలై 2, 2025 నుంచి అధికారికంగా బుకింగ్స్ మొదలు అధునాతన ఫీచర్లు, 540-డిగ్రీ కెమెరా ప్రత్యేక ఆకర్షణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ మీడియా న్యూస్... భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని మరింత విస్తరిస్తూ, ఎంతగానో ఎదురుచూస్తున్న హారియర్ ఈవీని మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీకి చెందిన ఆరు ఎలక్ట్రిక్ మోడళ్ల సరసన ఇది ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. రూ. 21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వస్తున్న ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ జూలై 2, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, హారియర్ ఈవీ ప్రత్యేకతలు, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. ప్లాట్‌ఫామ్, డ్రైవ్‌ట్రెయిన్ - డిజైన్ టాటా హారియర్ ఈవీని కంపెనీకి చెందిన అధునాతన యాక్టి.ఈవీ (Acti.ev) ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. ఇ...