గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు
గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు
--- గద్దర్ జయంతి వేడుకల్లో ఫౌండేషన్‌కు భాగస్వామ్యం
--- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్....
హైదరాబాదు న్యూస్,జూన్-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గద్దర్ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది.ఆ క్రమంలో చూస్తే..ఫౌండేషన్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా,సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే తెలంగాణ ఉద్యమం,సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది.
ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.
Comments
Post a Comment