ఆర్కేపిలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు - ఎమ్మెల్యే జి.వివేక్ ప్రార్ధనలు
ఆర్కేపిలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు - ఎమ్మెల్యే జి.వివేక్ ప్రార్ధనలు -- షవ్వల్ నెలవంకతో ఉపవాసం విరమించిన ముస్లిం సోదర్లు -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-31 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఈద్గా వద్ద పట్టణ ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో సోమవారం రంజాన్ పండుగ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అక్కడి ఈద్గా నందు ముస్లిం సోదరులు నమాజ్ ఆచరించుట కొరకు ఏర్పాట్లు చేసారు.మదీనా మస్జీద్ ఇమామ్ రంజాన్ పండుగ విశిష్టత తెలియచేసి,ఈద్ -ఉల్ -ఫితర్ ఈద్ నమాజ్ బిలాల్ మస్జీద్ ఇమామ్ అబ్దుల్ అజీజ్ నమాజ్ చదివించి ప్రత్యేక ప్రార్ధన చేసారు.అదే విదంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్ కు వ్యతిరేకంగా ఇక్కడి నమాజ్ కు వచ్చిన ముస్లిం సోదరులందరూ కుడి చేతికి నల్ల రిబ్బన్ ధరించి వాళ్...