జీవితమంటేనే ఒక సవాల్ ? నిజాయితీగా గేలవాలి
జీవితమంటేనే ఒక సవాల్ ? నిజాయితీగా గేలవాలి
జీవితమనేది ఊరికే కాదు..కన్నీళ్లు పెట్టికోవాలి..కష్టాలు ఎదుర్కోవాలి..బాధలు తట్టుకోవాలి..మనస్సుకి గాయాలు చేసుకోవాలి..మాటలకు గుండె ముక్కలు కావాలి..ఎదురు దెబ్బలు తినాలి.అంతేకాదు కొన్నిసార్లు బంధాలను కోల్పోవాలి.సహనంతో మెదగాలి.ఆ గుణపాఠాలు నేర్చుకోవాలి.ఇంకా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి.ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయాలి.నీ మీద నీకు పూర్తి నమ్మకం ఉండాలి..నీ నిర్ణయం మీదనే నీకు ధైర్యం ఉండాలి.నీ నిశ్చయత మీద నీకు ప్రణాళిక ఉండాలి.నీ ఆలోచన మీద నీకు నిలకడ ఉండాలి.ఎన్నో ఆశలు ఉండొచ్చు కానీ,ఆశలు లేకున్నా ఉన్నదానిలో తృప్తిగా,మనస్ఫూర్తిగా..మనసారా..బ్రతకడం నేర్చుకోవాలి.ఏదో చేయాలని ఆశ..ఎదో చేయలేకున్న చేసేదానిలో సంతృప్తి పొందాలి..లోకమంతా విహరించకున్న విరహం లేకుండా బ్రతకగలగాలి.ఆశించటం అంటే కనపడే చెట్టుపై ఉన్న కాయలను కోసినంత సులువు కాదు..ఆశించిన దానిని పొందడం దానికి ఎంతో నిబద్ధతతో నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే అది అనుకున్నవి పొందగలం.అలాగే ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా..నీ చుట్టు అంధకారం చుట్టు ముట్టిన..తొందరపడకు కాస్త సహనం వహించు.అవన్నీ నీకు తల వంచుతాయి.ఎప్పుడు ఏమరుపాటు వద్దు.నేర్పుగా,ఓర్పుతో..ముందుకు సాగిపో..నీ నిర్ణయం సరైంది అయితే పైవాడు దేవుడు తప్పక అనుగ్రహం చూపిస్తాడు.ఇందులో ఎలాంటి సందేహం లేదు.నమ్మటం.. నమ్మకపోవడం అది నీ ఇష్టం.నీ చేతనైతే నమ్మకం నీలో ఉంటే..ఆ దైవమే నీకు దారి చూపిస్తుంది.దానికి ఉండవలసింది మొదటిది నీమీద నీకు ఆత్మవిశ్వాసం, రెండవది ప్రయత్నవాదం.
-- అందరికీ కృతజ్ఞతలతో....మీ కలువల శ్రీనివాస్ - జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా చైర్మన్ - ఎడిటర్.
Comments
Post a Comment