గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ 





మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ సినియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య అనారోగ్య బారినపడ్డ విషయం తెలుసుకొని వారి ఇంటికి వచ్చి శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.కుటుంబ సభ్యులను ట్రీట్మెంట్ విషయాలను అడిగి తెలుసుకొని అన్ని విధాలుగా సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు.అనంతరం ఇటీవల పున:ప్రారంభించిన కాజిపేట్ అజ్ని పాసెంజర్ ట్రైన్ పురస్కరించుకొని స్థానిక రవీంద్ర ఖని రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వని విషయాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపి దృష్టికి తీసుకెళ్లారు.ఆ విషయమై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.ఇటీవల కాలంలో మరణించిన కాంగ్రెస్ నాయకులు కుదిరే రామస్వామి తండ్రి కుదురే రాజయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.వాళ్ల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి