క్యాతనపల్లిలో ఓటుకు పెద్ద నోటులు ఇస్తున్నారని నిలదీసింది

ఓటుకు పెద్ద నోటులు ఇస్తున్నారని నిలదీసిన స్వతంత్ర అభ్యర్థిని 



జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని  ఏరియా హాస్పిటల్ రోడ్డులో గల సెయింట్ జోసఫ్ స్కూల్ యొక్క పోలింగ్ బూత్ 21లో ఆ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని స్వర్ణలతకు చెందిన ఐదుగురు అనుచరులు ఓటుకు పెద్ద నోట్లు ఇస్తుండడంతో అదే వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థిని దోమల సౌజన్య ఆమె భర్త తిరుపతి వాళ్లకు సంబంధించిన వ్యక్తులు పట్టుకొని నిలదీశారు. ఆ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిని మాట్లాడుతూ..ఆమె గెలుపును చూసి ఓర్వలేకనే ఆ విధంగా చేస్తున్నారని దానిపై ఆమెకు న్యాయం చేయాలని అధికారులను ఆమె డిమాండ్ చేశారు.ఆ విషయమై బిఆర్ఎస్ పార్టీ నాయకులను అవార్డుకు సంబంధించిన పార్టీ శ్రేణులను జర్నలిస్టు టీవీ ఛానల్ ప్రశ్నించగా అది పుకారు మాత్రమే అని కొట్టి పరేశారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ