బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం!
బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం! తెలంగాణ జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్... మంచిర్యాల న్యూస్,మార్చి-30:బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేరం అలేఖ్య హైకోర్టు ప్రముఖ న్యాయవాది తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ లో బీ జే పీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లులో 33 శాతానికై ఆగ మేఘాల మీద రెండు రోజులు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించడం జరిగినది. ఈ బిల్లులో బీసీ మహిళలకు అవకాశం లేకుండా అగ్రవర్ణాల వాళ్లకు ఉపయోగపడే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. దీనిని స్వతంత్ర భారతదేశంలోని 80 కోట్ల బీసీ జనాభాలో 40 కోట్ల మంది బీసీ మహిళలము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును 2027లో అమలు చేయటానికి ఆమోదం పొందటానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపయోగపడే విధంగా 33 శాతంలో అర్ధ భాగం 16- 1/2 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుత...