మంచిర్యాలలో వైద్య రంగానికి మైలురాయి-టీజీఎంసి సిపిడి-2026 సక్సెస్

మంచిర్యాలలో వైద్య రంగానికి గొప్ప మైలురాయి-టీజీఎంసీ చైర్మన్


టీజీఎంసి ఆధ్వర్యంలో సిపిడి-2026 విజయవంతం
 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
మంచిర్యాల న్యూస్,మార్చి-1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసి)ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ),హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ ఆర్ డి ఏ)సంయుక్తంగా ఆదివారం కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సిపిడి)2026 అనే కార్యక్రమాన్ని మంచిర్యాలలోని శుభం కన్వెన్షన్ హాల్లో భారీ ఎత్తున నిర్వహించారు.ఆ కార్యక్రమానికి టీజీఎంసిఛైర్మన్,వైస్ ఛైర్మన్,టీజీఎంసి సభ్యులు హాజరైనారు.ఆ నేపథ్యంలోనే సుమారు 300 మందికి పైగా వైద్యులు ప్రతినిధులు (డెలిగేట్స్)ఇంకా ఫ్యాకల్టీగా పాల్గొన్నారు.ముఖ్యంగా అంతర్జాతీయ ఖ్యాతి గల ప్రముఖ వక్తలు వివిధ వైద్య విభాగాలకు చెందిన వైద్యులకు తాజా వైద్య విజ్ఞానం,నైపుణ్యాలపై అవగాహన కల్పించారు.ఆ కార్యక్రమంలో భాగంగానే టీజీఎంసి సభ్యులు,జిల్లా వైద్యాధికారి(డి ఎం హెచ్ ఓ),ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు విచ్చేశారు.అయితే క్వాకరీ(అనధికార వైద్యం),అనైతిక వైద్య విధానాలు,ప్రొఫెషనల్ మిస్కండక్ట్‌ను అరికట్టే మార్గాలపై చర్చించారు.ప్రధానంగా తెలంగాణలో తొలిసారిగా ఆన్‌లైన్ సిపిడి క్రెడిట్ పాయింట్ల ప్రారంభం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.ఆ సందర్భంగా టీజీఎంసి సభ్యులు కాబడిన డా.యెగ్గన శ్రీనివాస్,చైర్మన్ డా.కే.మహేష్ లు క్వాకరీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాగా వైద్య రంగంలో నైతిక విలువలు,రోగుల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.ఆ కార్యక్రమం వైద్య వృత్తిలో నైపుణ్యం,బాధ్యత-పారదర్శకతను మరింత బలపరిచే దిశగా ఒక ప్రాముఖ్యమైన అడుగుగా నిలిచిందాని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో డీజీఎంసి చైర్మన్,వైస్ చైర్మన్ డా.కిరణ్ కుమార్,మెంబెర్స్ డా.సన్నీ డేవిస్,డా.రాజ్ కుమార్,డా.శ్రీనివాస్ గూడగని,ఐఎంఏ ప్రెసిడెంట్ రవి ప్రసాద్,సెక్రటరీ డా.అనిల్ అండ్ ట్రెజర్ డా.సంతోష్, తదితర వైద్య ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ