Posts

Showing posts from September, 2025

పేద ప్రజలు,వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మంచిర్యాల కల్వరి టెంపుల్

Image
పేద ప్రజలు,వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మంచిర్యాల కల్వరి టెంపుల్  -  25 కుటుంబాలు-వందమందికి చేయూత  మంచిర్యాల,రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : కల్వరి టెంపుల్ మంచిర్యాల వ్యవస్థాపకులు డాక్టర్ పి.సతీష్ కుమార్ దైవజనులు ఆదేశాలు మేరకు పేద ప్రజలు,వరద బాదితుల కుటుంబాలకు మంచిర్యాల కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో గురువారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లాలోని హాజీపూర్,రసూల్ పల్లి,ఇందారం,ఆర్కే-6,రామకృష్ణాపూర్,మంచిర్యాల,గద్దె రాగడి ప్రాంతాలలోని వివిధ ఏరియాలలో నివసిస్తున్న పేద ప్రజలకు అలాగే వర్షాలు ఎక్కువగా పడటంతో కష్టాలు ఎదుర్కొంటున్న వరద బాధితులకు బియ్యం పప్పు రవ్వ ఆయిల్ ప్యాకెట్స్ పసుపు తదితర వస్తువులతో కూడిన నిత్యవసర వస్తువుల యొక్క కిట్టులను ప్రజలకు సహాయార్థంగా అందజేశారు.ఆ తరుణంలో దాదాపుగా 25-కుటుంబాలకు ఒక్కొక్క కిట్టు చొప్పున ప్రేమతో ఆప్యాయంగా పంపిణీ చేశారు.దాంతో సుమారు వందమంది కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగా సహాయం చేశారు.ఆ సహాయం పొందిన ప్రజలు ఎంతో భావోద్వేగానికి గురి అయ్యారు.దాంతో కల్వరి టెంపుల్ దైవజనులు డ...

ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసిఎంవో,ఇద్దరు డాక్టర్లకు ఆత్మీయ వీడ్కోలు

Image
ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసిఎంవో,ఇద్దరు డాక్టర్లకు ఆత్మీయ వీడ్కోలు  -- బదిలీ అయినా ఆ ముగ్గురికి సభలో గౌరవంగా సత్కారం  రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రసన్న కుమార్ బదిలీపై వెళ్తున్న దృష్ట్యా బుధవారం ఆయనకు గౌరవంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఆ క్రమంలో చూస్తే..ఏరియాస్పత్రిలో సాయంత్రం ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభలో డివైసిఎంఓ ప్రసన్న కుమార్ తో పాటు బదిలీపై వెళుతున్న చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ రామ్మోహన్ అలాగే మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జానకిలకు శాలువాలు కప్పి ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.ఆ సందర్భంగా ఏఐటీయుసీ నాయకులు అక్బర్ అలీ,ఇప్ప కాయల లింగయ్య ఆధ్వర్యంలో ఆసుపత్రి ఫిట్ సెక్రెటరీ ఇంకా ఆ కార్మిక సంఘం నాయకులు బదిలీపై వెళ్తున్న డివైసీఎంవోతో పాటు ఇద్దరు డాక్టర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఆ సందర్భంగా బదిలీపై వెళ్తున్న డివై సీఎంవో డాక్టర్ ప్రసన్న కుమార్,చెస్ట్ ఫి...

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

Image
ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుడు ఆత్మహత్య -  ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-3, జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బి-జూన్ లోని శ్రీనివాస నగర్(క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వార్డు)కు చెందిన కుషనపెల్లి నవీన్(33)అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గోర విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా మృతుడు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.కాగా ఆ మృతునికి భార్య ఇద్దరు కుమారులు తండ్రి ఉన్నారు.ఆ మేరకు స్థానిక ఎస్సై రాజశేఖర్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఫ్రెండ్స్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆత్మహత్యకు ముందు రెండు పేజీల లేఖ కూడా ఆ మృతి చెందిన యువకుడు వ్రాసినవి అక్కడ స్థలంలో లభ్యమయ్యాయి.నవీన్ ఆత్మహత్యకు గల అసలు కారణాలు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీ- సిబిఐ చేతికి ఆ మూడు కీలక కేసులు?

Image
తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీ- సిబిఐ చేతికి ఆ మూడు కీలక కేసులు? హైదరాబాద్ న్యూస్,సెప్టెంబర్-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేం దుకు సిద్ధమవుతోంది.ఆ క్రమంలో చూస్తే..రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించేందుకు రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది.ఇప్పటికే తెలంగాణలో రెండు కేసులను సీబీఐ విచారించనుంది.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫారస్సు చేసిన విషయం తెలిసిందే.గతంలో మంథనిలో న్యాయవాద దంపతులను హత్య చేసిన ఘటనకు సంబంధించిన కేసు కూడా సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.ఈ రెండు కేసులపై ప్రస్తుతం సీబీఐ విచారణ మొదలు పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకా శాలు కనిపిస్తున్నాయి.ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సిట్ దర్యాప్తును పరిశీలించడంతోపాటు సాధ్యాసాధ్...

క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి వివేక్

Image
క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి వివేక్  -  మొత్తం 286 ఇండ్లకు 230 పట్టాలు పంపిణీ  -  ప్రతి నియోజకవర్గానికి 350 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం  -   కాలేశ్వరం ప్రాజెక్టుతో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది  -   ఆ కాలేశ్వరం ప్రాజెక్టులో కోట్ల కమిషన్ మింగేసిన కేసిఆర్  -  యూరియా విషయంలో బిఆర్ఎస్,బిజెపి రాజకీయ డ్రామాలు చేస్తున్నారు -  కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు --  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ప్రసంగం...  రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంగళవారం రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్ లో ఏర్పాటుచేసిన ఆ ప్రోగ్రాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ముఖ్యఅ...

ప్రజావాణి ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Image
ప్రజావాణి ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి  -   మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్  మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)పి.చంద్రయ్య,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఆ నేపద్యంలోనే మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు సాయి కుంట కాలనీవాసులు తమ కాలనీలో కోతుల బెడద అధికంగా ఉందని, పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.నస్పూర్ మండలం తీగల్పహాడ్ గ్రామానికి చెందిన మండ రాయమల్లు,మండ శ్రీనివాస్ లు తాము నివసిస్తున్న ఇంటికి సంబంధించి అసెస్మెంట్ రికార్డులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.భీమారం మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కామెర లక్ష్మి తాను గతంలో సదరం సర్టిఫికెట్ ...