క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి వివేక్


క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి వివేక్ 

-  మొత్తం 286 ఇండ్లకు 230 పట్టాలు పంపిణీ 

-  ప్రతి నియోజకవర్గానికి 350 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం 

-   కాలేశ్వరం ప్రాజెక్టుతో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది 

-   ఆ కాలేశ్వరం ప్రాజెక్టులో కోట్ల కమిషన్ మింగేసిన కేసిఆర్ 

-  యూరియా విషయంలో బిఆర్ఎస్,బిజెపి రాజకీయ డ్రామాలు చేస్తున్నారు

-  కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

--  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ప్రసంగం... 

రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంగళవారం రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఆర్కేసిఓఏ క్లబ్ లో ఏర్పాటుచేసిన ఆ ప్రోగ్రాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరైనారు.దాంతో నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు.పట్టణంలోని నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం గుండా మంజూరు చేస్తామని పేర్కొన్నారు.ఆ తరుణంలో దాదాపు12 వేల కోట్ల ఖరీదు చేసి కాంగ్రెస్ ప్రజా పాలనలో రేషన్ కార్డులపై ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.అలాగే సబ్సిడీ గ్యాస్ తో పాటు ఉచిత విద్యుత్,మహిళలకు బస్సులో ఫ్రీ గా ప్రయాణం,రైతు భరోసా కింద 20 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు.కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతుల పంటలు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు వివరించారు.గతంలో సంబంధిత రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు కూడా గుర్తు చేశారు.ఆ కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కమిషన్ కోట్ల రూపాయలు మింగినట్లు ఆరోపించారు.ఆ నేపథ్యంలోనే రైతులకు యూరియా విషయమై బిఆర్ఎస్,బిజెపి రాజకీయ డ్రామాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా రైతన్నల పట్ల ఫర్టిలైజర్లు సరైన విధంగా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు.అయితే స్థానిక డబుల్ బెడ్ రూమ్ విషయంలో అర్హత లేని








వాళ్లను గతంలో తొలగించినట్లు వెల్లడించారు.దాంతో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే డబల్ బెడ్ రూమ్ కేటాయించినట్లు వాళ్లకు పట్టాలు పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు.అనంతరం ఫిషరీస్ వాహనంను మంత్రి ప్రారంభించారు.ఆ కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్,మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,సంబంధిత అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు,మాజీ ప్రజా ప్రతినిధులు,లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి