ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి
ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్...ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి
-- ఆ పశువుల ఖరీదు పది లక్షలు పైగానే ఉంటుంది
-- అమరవాది పశువుల యాజమానుల కన్నీటి రోదనలు మిన్నంటాయి
-- ఆ దోషులపై కేసు నమోదు చేసిన పోలీసులు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,మే-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియాసుపత్రి సమీపంలోని అమరావాది చెరువు సమీపంలో గల పంట పొలంలో ఆదివారం కరెంట్ షాక్ (కరెంటు విద్యుత్ తీగలు) తగిలి అభం శుభం తెలియని మూగజీవులు కాబడిన 11 గేదెలు,ఒక దున్నపోతు అక్కడికక్కడే మరణించిన గోరమైన విషాద సంఘటన ఇక్కడ చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..శేషయ్య అనే ల్యాండ్ ఓనర్ కు చెందిన ఆ పొలంను కొమురయ్య అనే వ్యక్తి అక్కడి పంట పొలంను లీజుకు తీసుకున్నాడు.దాంతో ఆ పంట పొలంలోకి అడవి పందులు ఇతర జంతువులు రాకుండా ఉండడానికి ఆ పొలం చుట్టూ విద్యుత్ తీగలు సరఫరా చేసి కంచెలాగా అమర్చాడు.ఆ సమయంలో పశువుల మంద అటువైపు పంట పొలంలోకి చేరుకొని మేత చేస్తుండగా ఆ పొలం చుట్టువైపు ఏర్పాటు చేసిన కరెంటు
విద్యుత్ తీగలు కాస్తా ఆ గేదెలకు తాకడంతో వెంటనే షాక్ వచ్చి అక్కడికక్కడే ఆ మూగ జంతువులు మృతి చెందాయి.ఆ మృతి చెందిన జంతువులలో 11 పాలు ఇచ్చే గేదెలు అలాగే ఒక దున్నపోతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఆ విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకొని అన్ని కోణాలలో విచారణ వేగంగా ప్రారంభించారు.ఆ మేరకు సంబంధిత దోషులపై కేసు కూడా నమోదు చేశారు.దాంతో సొంత పశువులు చనిపోవడంతో ఆ మూగ పశువుల యజమానులు కన్నీమున్నీరుగా రోదించారు.ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,గోపు రాజంలు అక్కడికి చేరుకొని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.దాంతో అమరావాది చెరువు ప్రక్కన పంట పొలంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన జంతువుల యజమానులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేశారు.ముఖ్యంగా జంతువుల యొక్క ప్రాణ నష్టంతో పాటు లక్షలు ఖరీదు నష్టం కావడంతో అక్కడి గ్రామంలో కన్నీటి విషాదాచాయాలుఎక్కువగా నెలకొన్నాయి.ఆ మేరకు రామకృష్ణాపూర్ ఎస్ఐ జి.రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment