ప్రజావాణి ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణి ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి 






-   మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)పి.చంద్రయ్య,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఆ నేపద్యంలోనే మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు సాయి కుంట కాలనీవాసులు తమ కాలనీలో కోతుల బెడద అధికంగా ఉందని, పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.నస్పూర్ మండలం తీగల్పహాడ్ గ్రామానికి చెందిన మండ రాయమల్లు,మండ శ్రీనివాస్ లు తాము నివసిస్తున్న ఇంటికి సంబంధించి అసెస్మెంట్ రికార్డులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.భీమారం మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కామెర లక్ష్మి తాను గతంలో సదరం సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోగా 50 శాతంతో ధ్రువపత్రం మంజూరు చేసినందున దివ్యాంగ పింఛన్ రాలేదని,పింఛన్ రిజెక్ట్ అయిన వివరాలను తొలగించి భర్త మరణించినందున తనకు వితంతు పింఛన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన పుప్పాల సంతోష్ గతంలో తన నాయనమ్మ పట్టాదారుల నుండి సాదా బైనమా ద్వారా భూమి కొనుగోలు చేసిందని,ఇట్టి భూమికి సంబంధించి తమకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన పిట్టల సునంద తాను వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవిస్తున్నానని,ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు ఉందని,కానీ తాను ఏ విధమైన లబ్ధి పొందలేదని,తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.బెల్లంపల్లి పట్టణం గ్రౌండ్ బస్తీకి చెందిన కుక్కల అనసూయ తాను తన తల్లితో కలిసి ఉంటున్నానని,ప్రభుత్వ పథకాలలో కంప్యూటర్,కుట్టు మిషన్ ఇతర రంగాలలో శిక్షణ పొందానని,తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన రామగిరి కిష్టయ్య ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు వచ్చిందని, కానీ ఇల్లు మంజూరు కాలేదని,అనాధ అయిన తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.మందమర్రి మండలం శ్రీపతి నగర్ కు చెందిన సముద్రాల సుజాత దివ్యాంగురాలిని అయిన తనకు దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన దగ్గుల వేణు తమ భూమిని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేసేందుకు రైల్వే ట్రాక్ నిర్మాణం కొరకు తీసుకోవడం జరిగిందని దాంతో ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని,జీవన ఆధారమైన భూమిని కోల్పోయిన తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.దళిత సంఘాల ప్రతినిధులు బొజ్జ శరత్,నక్క శ్రీనివాస్,తీగల శ్రీనివాస్ లు జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి, ఆత్మ గౌరవాన్ని కాపాడడం కొరకు ఎస్.సి.,ఎస్.టి. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఆ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి