ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసిఎంవో,ఇద్దరు డాక్టర్లకు ఆత్మీయ వీడ్కోలు

ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసిఎంవో,ఇద్దరు డాక్టర్లకు ఆత్మీయ వీడ్కోలు 















-- బదిలీ అయినా ఆ ముగ్గురికి సభలో గౌరవంగా సత్కారం 

రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రసన్న కుమార్ బదిలీపై వెళ్తున్న దృష్ట్యా బుధవారం ఆయనకు గౌరవంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఆ క్రమంలో చూస్తే..ఏరియాస్పత్రిలో సాయంత్రం ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభలో డివైసిఎంఓ ప్రసన్న కుమార్ తో పాటు బదిలీపై వెళుతున్న చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ రామ్మోహన్ అలాగే మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జానకిలకు శాలువాలు కప్పి ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.ఆ సందర్భంగా ఏఐటీయుసీ నాయకులు అక్బర్ అలీ,ఇప్ప కాయల లింగయ్య ఆధ్వర్యంలో ఆసుపత్రి ఫిట్ సెక్రెటరీ ఇంకా ఆ కార్మిక సంఘం నాయకులు బదిలీపై వెళ్తున్న డివైసీఎంవోతో పాటు ఇద్దరు డాక్టర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఆ సందర్భంగా బదిలీపై వెళ్తున్న డివై సీఎంవో డాక్టర్ ప్రసన్న కుమార్,చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ రామ్మోహన్,మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జానకి డాక్టర్లు ఏరియా ఆసుపత్రిలో ఉద్యోగరీత్యా అందించిన మంచి సేవలు గూర్చి వివరించడంతోపాటు వాళ్ల యొక్క అభిరుచిలపై కొనియాడారు.దాంతో ట్రాన్స్ఫర్ కాబడిన ఆ ముగ్గురు ప్రమోషన్లతో అభివృద్ధి చెందాలని ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరారు.ఆ కార్యక్రమంలో ఆసుపత్రి సంక్షేమ అధికారి,ఆసుపత్రి ఆఫీస్ సూపరింటెండెంట్,ఆసుపత్రి డాక్టర్లు,ఏఐటీయూసీ,ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీలు,వార్డు బాయిలు,నర్సులు,ఆయాలు,జనరల్ మజ్దూర్లు,ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బంది,కాంట్రాక్టు ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి