పేద ప్రజలు,వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మంచిర్యాల కల్వరి టెంపుల్
పేద ప్రజలు,వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మంచిర్యాల కల్వరి టెంపుల్
- 25 కుటుంబాలు-వందమందికి చేయూత
మంచిర్యాల,రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : కల్వరి టెంపుల్ మంచిర్యాల వ్యవస్థాపకులు డాక్టర్ పి.సతీష్ కుమార్ దైవజనులు ఆదేశాలు మేరకు పేద ప్రజలు,వరద బాదితుల కుటుంబాలకు మంచిర్యాల కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో గురువారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లాలోని హాజీపూర్,రసూల్ పల్లి,ఇందారం,ఆర్కే-6,రామకృష్ణాపూర్,మంచిర్యాల,గద్దె రాగడి ప్రాంతాలలోని వివిధ ఏరియాలలో నివసిస్తున్న పేద ప్రజలకు అలాగే వర్షాలు ఎక్కువగా పడటంతో కష్టాలు ఎదుర్కొంటున్న వరద బాధితులకు బియ్యం పప్పు రవ్వ ఆయిల్ ప్యాకెట్స్ పసుపు తదితర వస్తువులతో కూడిన నిత్యవసర వస్తువుల యొక్క కిట్టులను ప్రజలకు సహాయార్థంగా అందజేశారు.ఆ తరుణంలో దాదాపుగా 25-కుటుంబాలకు ఒక్కొక్క కిట్టు చొప్పున ప్రేమతో ఆప్యాయంగా పంపిణీ చేశారు.దాంతో సుమారు వందమంది కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగా సహాయం చేశారు.ఆ సహాయం పొందిన ప్రజలు ఎంతో భావోద్వేగానికి గురి అయ్యారు.దాంతో కల్వరి టెంపుల్ దైవజనులు డాక్టర్ సతీష్ కుమారు కు,
మంచిర్యాల కల్వరి టెంపుల్ సేవకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఆ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ సేవకులు అరుణ్,దినకర్,వినయ్,విజయ్,సామెల్,తిమోతి,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment