ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...
ఆర్కేపి లో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి అర్థగంట క్రితం ట్రాక్టర్ ఢీకొనడంతో మందమర్రి కి చెందిన పి.మల్లేశ్వరి(38) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.ఆ క్రమంలో చూస్తే...బైకుపై ఇద్దరు వస్తుండగా ఎదురుగా ఒక ట్రాక్టర్ కూడా రావడంతో అదే సమయంలో 2 ఎద్దులు పోట్లాడుతూ బైక్ మీదకు రావడంతో బైక్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎడమవైపు ఆ బైకుపై కూర్చున్న మహిళ కుడివైపు పడడంతో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆమె తల మీద వెళ్ళింది.దాంతో ఆమె తల పగిలి మెదడు బయటికి వచ్చి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.ప్రధానంగా చూస్తే..ట్రాక్టర్ డ్రైవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం అలాగే ఎద్దులు కూడా బైకు మీదకు రావడం చేత అవి పోట్లాడుకోవడం చేత బైకుకు ఎదురుంగా అడ్డంగా రావడంతోనే ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.ఆ విషయం తెలిసిన వెంటనే రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జె.శ్రీధర్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆ విషయమై ట్రాఫిక్ జామ్ లేకుండా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది.అలాగే ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు మోటార్ బైక్ నడిపిన వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment