ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు
ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు
- పాస్టర్ రెవారెండ్ ఎం.జాషువా దైవ సందేశం అందించారు
- తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-29,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సీఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో ఆదివారం మట్టల ఆదివారం మహోత్సవం వేడుకలు ఆ చర్చి క్రైస్తవులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..సిఎస్ఐ మెదక్ డయాసిస్ సంఘంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సెయింట్ పీటర్స్ చర్చి బ్రాంచ్ దైవజనులు పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఆ సంఘానికి చెందిన క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే పట్టణంలోని యూనియన్ బ్యాంకు ముందు గల సిఎస్ఐ చర్చి దేవాలయం నుంచి స్థానిక అంబేద్కర్ అంగడి బజార్ వద్దకు సీఎస్ఐ చర్చి క్రైస్తవులు కొబ్బరి మట్టలు చేత పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఊరేగింపు చేశారు.దాంతో క్రైస్తవులందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఇద్దరేసి చొప్పున క్యూలైన్లో ఊరేగింపుగా బయలు దేరారు.దాంతో హోసన్నా.. హోసన్నా...జయం..జయం..అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడంతో పాటు యేసు క్రీస్తు దేవుని పాటలు పాడుతూ ర్యాలీగా బయలుదేరారు.అయితే లోక రక్షకుడైన క్రీస్తు దేవునికి మహిమ కలిగే విధంగా మట్టలు చేత పట్టుకొని గాలిలో ఊపుతూ క్రైస్తవులు వాళ్ల యొక్క ఐక్యతను చాటి చూపారు.ఆ సందర్భంగా ఆర్కేపి సిఎస్ఐ చర్చి పాస్టర్ రేవా రెండ్ ఎం.జాషువా మాట్లాడుతూ..క్రైస్తవ లోకానికి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మంచి సందేశం అందించారు.ప్రధానంగా 2000ల సంవత్సరం క్రితం యేసు రక్షకుడు కాబడిన క్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు ఎరుషలేముకి వెళ్ళినప్పుడు క్రీస్తు దేవుడు గాడిదపై అక్కడి దేవాలయానికి చేరుకున్నట్లు గుర్తు చేశారు.ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువు గొప్ప సాత్వికుడని వివరించారు.ఎరుషలేముకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు జయం..జయం..అంటూ అక్కడి ప్రజలు భూమిపై బట్టలు పరచడంతో పాటు చెట్ల కొమ్మలను వేసి గౌరవంగా ఆహ్వానం కూడా భారీ ఎత్తున పలికినట్లు స్పష్టం చేశారు.అంతేకాకుండా హోసన్నా.. హోసన్నా...జయం..జయం..అని పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడంతో పాటు దావీదు కుమారునికి ఏసుక్రీస్తు ప్రభువుకు ఆహ్వానం పలికినట్లు వెల్లడించారు.పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్న ప్రేమను చూపించడానికి తండ్రి దేవుడి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు గాడిదపై వచ్చినట్లు తెలిపారు.ఆయన ఎరుషలేము వచ్చినప్పుడు గాడిదని మాత్రమే ఎంచుకొని ఆ గాడిద మీద రావడం ఆయన యొక్క గొప్ప సాత్వికుడై ఉన్నట్లు ప్రజల కోసమే వచ్చినట్లు తెలిపారు.అనంతరం క్రైస్తవులందరూ కూడా మళ్లీ తిరిగి ఊరేగింపుగా ఆలయం చేరుకున్నారు.తధానంతరం దేవాలయంలో జరిగిన ఆరాధనలో పాస్టర్ జాషువా మట్టల ఆదివారం పురస్కరించుకొని దైవ సందేశం గొప్పగా అందించారు.ప్రధానంగా క్రైస్తవులు ఆరోజు మట్టలు చేత పట్టుకొని ఉదయం పూటనే చర్చికి చేరుకొని సంతోషంగా ఊరేగింపులో పెద్ద ర్యాలీగా కనబడటం ఇంకా అందర్నీ ఆకర్షించడం కనిపించింది.ఆ కార్యక్రమం వేడుకలను కవరేజ్ చేసిన తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-టీవీ ఛానల్ ఎడిటర్ కలువల శ్రీనివాస్ యొక్క యాజమాన్యంకు కూడా సిఎస్ఐ సంఘం తరఫున పాస్టర్ జాషువా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సిఎస్ఐ సెయింట్ పీటర్స్ ఆర్కపి పాస్టర్ రేవా.ఏం.జాషువా,పాస్టరమ్మ కళావతి జాషువా,చర్చ్ కమిటీ సభ్యులు శరత్ బాబు,పుష్ప రాజ్,చిప్పరి శ్రీనివాస్,దేవాకుమార్,యూత్ సెక్రటరీ డింపు-విశాల్,స్త్రీల సెక్రటరీ సిహెచ్ ప్రేమలత,ఏం.నెల్సన్,మట్ట ప్రతాప్,నిరూపన్,క్రైస్తవ సోదరీ సోదరులు యువకులు,చిన్న పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.jpg)


Comments
Post a Comment