ఆర్కే-3 కనకదుర్గ దేవాలయంలో అత్యంత వైభవంగా అభిషేకం-పూజ
ఆర్కే-3 మూతబడిన గని వద్ద కనకదుర్గ దేవాలయంలో అత్యంత వైభవంగా అభిషేకం-పూజ
- భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు,అన్నదానం
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్....
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని మూతబడిన ఆర్కే-3 భూగర్భ
గని ప్రాంతంలోని కనకదుర్గా దేవి ఆలయంలో గురువారం అత్యంత వైభవంగా కనకదుర్గ దేవి తల్లికి పూజ మహోత్సవం నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే ఉగాది పండుగ పురస్కరించుకొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అభిషేకం ఘనంగా చేపట్టారు.ఆ సందర్భంగా పూజారి కటకం కుమారస్వామి భక్తులను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టు టీవీ ఛానల్ తో మాట్లాడారు.అయితే గత 25 సంవత్సరాలుగా కనకదుర్గ దేవి ఆలయంలో అక్కడి ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో పూజా మహోత్సవాలు పెద్ద ఎత్తిన చేపడుతున్నట్లు గుర్తు చేశారు.భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు చేసి ఆ తల్లి ఆశీర్వాదాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కుబడులు సమర్పించుకోవడం పూజలు చేయడం కనిపించింది.అనంతరం అన్న ప్రసాద వితరణ సైతం చేపట్టారు.ఆ పూజ మహోత్సవానికి పట్టణంలోని వ్యాపారస్తులు,స్థానిక ప్రజలు,మహిళలు,యువతి యువకులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments
Post a Comment