బొక్కలగుట్ట రోడ్డుపై ప్రమాదం-దంపతులకు తీవ్ర గాయాలు?ఫ్లాష్ న్యూస్..
బొక్కలగుట్ట రోడ్డుపై ప్రమాదం-దంపతులకు తీవ్ర గాయాలు?
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్....
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు కాబడిన దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లాలోని
మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు వెంకటస్వామి కేకే5 గనిలో ట్రామార్ గా ఉద్యోగం చేస్తున్నాడు.ఆయన భార్య పేరు సుమలత ఆ ఇద్దరు తీవ్రంగా రోడ్డు యాక్సిడెంట్లో గాయపడ్డారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల నుంచి ద్విచక్ర వాహనంపై మందమర్రి వైపు వస్తున్న సమయంలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలోని వంతెనపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టినట్టు తెలుస్తుంది.ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆ ఇద్దరు దంపతులను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మృతి చెందడంతో పాటు భార్య సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం...


Comments
Post a Comment