అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో మహిళలు రక్తదాన శిబిరంకు సిద్ధం
అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో మహిళలు రక్తదాన శిబిరంకు సిద్ధం!
- మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం...
మంచిర్యాల న్యూస్,మార్చి-5జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: ఈ ఏడాది మార్చి-8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ మంచిర్యాల ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జి డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లయన్ వి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వనిత వాక్కు ఫౌండేషన్,నందగోపాల టీం వాళ్ల యొక్క సహాయసహకారాలతో మొట్టమొదటిసారి ప్రత్యేకంగా "మహిళల రక్తదాన శిబిరాన్ని" నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ లయన్ వి.మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఆ నేపథ్యంలోనే సంబంధిత
మహిళల రక్తదాన శిబిరం మార్చి-7 శనివారము మధ్యాహ్నము ఒకటి గంట నుంచి నాలుగు గంటల వరకు మంచిర్యాలలోని సురభి ఏసీ హాల్లో రెడ్ క్రాస్ రక్తనిధి సౌజన్యంతో చేపడుతున్నట్లు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆ రక్తదాన శిబిరము నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశము రక్తదానం మీద మహిళలను చైతన్యపరచుటకు వారికి అవగాహన కల్పించుట వాళ్ళని ప్రోత్సహించడంతోపాటు తరచూ రక్తదానానికి ప్రేరేపించడం తగిన విషయాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.కాగా 11.5 హిమగ్లోబిన్,45 కేజీల బరువు ఉండి ఆరోగ్యవంతమైన ప్రతి మహిళ ఆరు నెలల ఒకసారి రక్తదానం చేయడానికి అర్హులుగా ఉంటారని గుర్తు చేశారు.ఆ మహిళా రక్తదాన శిబిరంలో ఎక్కువ సంఖ్యలో హాజరుకావాలని దాంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి మహిళను ముఖ్య అతిథుల చేదు మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించి,లయన్స్ ఇంటర్నేషనల్ ప్రశంసా పత్రం తో పాటు ప్రోత్సాహక బహుమతిలు బహుకరించడం జరుగుతుందని తెలిపారు.ఆ కార్యక్రమంలో మహిళలను చైతన్యపరిచి ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తున్న వనిత వాక్కు ఫౌండేషన్ ఇంకా నందగోపాల టీం సభ్యులు సునీత,కవిత,జోత్స్నా చంద్రదత్,లావణ్య,కార్యవర్గ సభ్యులు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆ సందర్భంగా కార్యక్రమంలో సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ వి.మధుసూదన్ రెడ్డి,లయన్ ఎం.రామాంజనేయులు,లయన్ ఏ.రాజేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment