ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్'
ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్' ప్రోగ్రాం
పట్టణ ఎస్ఐ జే.శ్రీధర్ సూచనలు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన 'అరైవ్ అలైవ్' ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ లోనీ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సంబంధిత ప్రోగ్రాం నిర్వహించారు.ఆ సందర్భంగా పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ ఆసుపత్రిలోని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే మోటార్ సైకిల్ పై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ఫోర్ వీలర్ దారులు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని గుర్తు చేశారు.అలాగే వాహనంకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని సిబ్బందికి ఉండాల్సిన బాధ్యతలు,క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.దాంట్లో ముఖ్య అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.చిన్నపిల్లలకు టూవీలర్-ఫోర్ వీలర్ ఇవ్వకూడదని,అతివేగంగా ఆజాగ్రత్తగా నడపకుండా చూడాలని వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎస్ఐ స్పష్టం చేశారు.అనంతరం ఏరియా ఆసుపత్రి డివై సీఎంఓ మధు కుమార్ మాట్లాడారు.ఆ కార్యక్రమంలో సింగరేణి ఏరియా హాస్పిటల్ డివైసీఎంఓ డాక్టర్ మధు కుమార్,ఎస్ఐ ఎస్సై జే.శ్రీధర్,హెడ్ కానిస్టేబుల్ సంఘ సత్తయ్య,కానిస్టేబుల్ సతీష్,హోమ్ గార్డ్ సమ్మయ్య,ఏరియా హాస్పిటల్ సిబ్బంది. పాల్గొన్నారు.


Comments
Post a Comment