99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*
*జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
99 రోజుల కార్యక్రమం పై పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి న్యూస్, మార్చి 06: జర్నలిస్టు దినపత్రిక మరియు మీడియా న్యూస్ పెద్దపల్లి జిల్లా బ్యూరో:99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమం అమలు పై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* నూతనంగా గెలిచిన స్థానిక నాయకులకు ప్రజలలో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని మార్చి 6 నుంచి మార్చి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కౌన్సిలర్ లకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్య సంబంధించి చేయాల్సిన పనులు చైర్ పర్సన్ దృష్టికి తీసుకొని వస్తె వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తామనిఏ ఫైల్ తిరస్కరించిన స్పష్టమైన కారణం తెలియజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 99 రోజుల కార్యక్రమంలో చివరి వరకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గోన్నాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య వైస్ చైర్ పర్సన్ ముస్కాన్ నాజ్ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కౌన్సిలర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment