బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం!

బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం!

తెలంగాణ జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్...

మంచిర్యాల న్యూస్,మార్చి-30:బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేరం అలేఖ్య హైకోర్టు ప్రముఖ న్యాయవాది తెలిపారు.

ఆమె మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ లో బీ జే పీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లులో 33 శాతానికై ఆగ మేఘాల మీద రెండు రోజులు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించడం జరిగినది. ఈ బిల్లులో బీసీ మహిళలకు అవకాశం లేకుండా అగ్రవర్ణాల వాళ్లకు ఉపయోగపడే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. దీనిని స్వతంత్ర భారతదేశంలోని 80 కోట్ల బీసీ జనాభాలో 40 కోట్ల మంది బీసీ మహిళలము వ్యతిరేకిస్తున్నాము. 

ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును 2027లో అమలు చేయటానికి ఆమోదం పొందటానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపయోగపడే విధంగా 33 శాతంలో అర్ధ భాగం 16- 1/2 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాము. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మహిళలకు రిజర్వేషన్లు 16 నర శాతం అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేసి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని కోరారు.

 ఇది జరగని ఎడల 2029 అసెంబ్లీ ఎన్నికలు ఇంకా లోక్సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ లు ఉపయోగపడకుండా నిర్ణయాలు తీసుకుంటే ! వాటికి వ్యతిరేకంగా అమరణ నిరాహార దీక్ష చేపడతానని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా హెచ్చరించారు.ఆ కార్యక్రమంలో బీ సి కులాల ఉద్యమ పోరాట సంఘం మహిళా విభాగం రాష్ట్రస్థాయి సీనియర్ నాయకురాలు కుమ్మరి కోడూరి లీలావతి ప్రజాపతి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ మూల రేణుక భాస్కర్ గౌడ్ జన్నారం మండలం మహిళా విభాగం అధ్యక్షురాలు ఫోతు విజయ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ