క్యాతనపల్లి కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు తెలుపాలి
- క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతీ ప్రసాద్ ప్రకటన
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీకి జరిగిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా పోటీ చేసిన సమస్త అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల యొక్క వివరాలు తెలపాలని బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ ఆదేశాల మేరకు ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ(13.02.2026 నుంచి 45 రోజులలో)ఎన్నికల ఖర్చు (ఎలక్షన్ ఎక్స్పెండిచర్) వివరములు నిర్ణీత ఫారంలో ఈ నెల తేదీ 27.03.2026 రోజు లోపు క్యాతనపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో సమర్పించాలని ప్రకటించారు.ఆ ఎన్నికల ఖర్చు యొక్క ఫారములు పురపాలక సంఘంలో ఉచితంగా ఇస్తారని దాంతో నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చు వివరాలను పురపాలక సంఘం క్యాతనపల్లిలో సమర్పించని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొనే చర్యలకు సంబంధిత వాళ్లు భాద్యులుగా ఉంటారని గుర్తు చేశారు.మరిన్ని ఇతర వివరాల కోసం క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసులో సంప్రదించాలని కమిషనర్ తెలిపారు.

Comments
Post a Comment