తెలంగాణలో 4-రోజులు భగభ ఎండలు-జాగ్రత్త సుమా!
తెలంగాణలో 4 రోజులు ఎండలు అధికం-జాగ్రత్త!
హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన
మంచిర్యాల న్యూస్,మార్చి-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఎండలు అధికంగా ఉంటాయి.ఆ క్రమంలో చూస్తే..రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరుగుతోందనీ మంగళవారం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.ప్రధానంగా రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఆ నేపథ్యంలోనే ఆదిలాబాద్,కొత్తగూడెం,భూపాలపల్లి,గద్వాల,ఆసిఫాబాద్,మహబూబ్ నగర్,మంచిర్యాల,ములుగు,నాగర్ కర్నూల్,నారాయణ్ పేట,నిర్మల్,నిజామాబాద్ జిల్లాల్లో 36°సి నుంచి 40°సి వరకు సంబంధిత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.దాంతో ప్రజలు తగిన విధంగా ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Comments
Post a Comment