సుల్తానాబాద్ శ్రీరామ్ నగర్ లో పోచమ్మ బోనాలు

సుల్తానాబాద్ శ్రీరామ్ నగర్ లో పోచమ్మ బోనాలు



మాజీ మున్సిపల్ కోఆప్షన్ మేంగని రాధ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో
సుల్తానాబాద్ న్యూస్ మార్చి 18 జర్నలిస్టు దినపత్రిక-మీడియా న్యూస్: పెద్దపల్లి జిల్లా బ్యూరో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ వీది ప్రజలంతా మాజీ మున్సిపల్  కో ఆప్షన్ మేంగనీ రాధ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో  వాడ ప్రజలు అంతా ఐకమత్యంతో పోచమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వాడ ప్రజలు మహిళలు బోనం ఎత్తుకొని శోబయాత్రగా బయలుదేరి పురవీధుల గుండా పోచమ్మ తల్లి వద్దకు చేరుకొనీ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మేకలతో మొక్కులు చెల్లించి నారు  ఇట్టి కార్యక్రమంలో విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి వారి స్కూలు బృందంచే పోచమ్మ బోనాల పాట లతో నృత్యం చేయించినారు ఇట్టి విషయమై చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉగాదికి ముందు 33 కోట్ల దేవతలకు ముందు పోచమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని పోచమ్మ తల్లికి బోనాలతో కొబ్బరికాయలు కోళ్లు మేకలతో మొక్కలు చెల్లించడం ఆనవాయితుగా వస్తున్నది అందులో భాగంగానే బుధవారం శ్రీరామ్నగర్ వీధి నుండి మహిళలు బోనాలతో డప్పు చప్పులతో పోచమ్మ తల్లిని సేవించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ వాడ ప్రజలే కాదు మున్సిపల్ పరిధి మరియు జిల్లా ప్రజలు అందరు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు ఇట్టి కార్యక్రమంలో  బుచ్చిరెడ్డి రౌతు రవీందర్  కత్తెర్ల పోచమల్లు మింగని శ్రీనివాస్ గొట్టం అంజయ్య రమేష్ అనిల్ శ్రీనివాస్ వేనగంటి రమేష్ రేషవేణి రమేష్ మరియు వాడ ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ