రంజాన్ పండుగతో ముస్లింలకు శుభాకాంక్షలు-మంత్రి వివేక్
రంజాన్ పండుగతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్ వెంకటస్వామి
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్.....
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: రంజాన్ పండుగ పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం సోదరి,సోదరులకు శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి,సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అందరి జీవితాల్లో ఆనందం,ఐశ్వర్యం నింపాలని,సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఆ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గోపతి రాజయ్య,ప్రభాకర్,మల్లేష్,రమేష్,అబ్దుల్ అజీజ్,అక్బర్ అలీ,పల్లె రాజు,గాండ్ల సమ్మయ్య,పట్టణ ముస్లిం నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment