తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండలు-రెండు రోజుల్లో ఉరుములతో వానలు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్....
మార్చి-14,హైదరాబాదు న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఆ క్రమంలో చూస్తే...గురు,శుక్రవారాల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.శుక్రవారం భద్రాద్రి-కొత్తగూడెం,నల్లగొండ,ఖమ్మం,నిజామాబాద్,జిల్లాల్లో 40.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.జగిత్యాల,కుమ్రం భీం ఆసిఫాబాద్,అదిలాబాద్, నారాయణపేట,పెద్దపల్లి జిల్లాల్లో 39.6 డిగ్రీలు,జనగామ,మంచిర్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీలు నమోదయ్యాయి.హైదరాబాద్ లో 37.3 డిగ్రీలు నమోదైంది.శనివారం ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని,ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
*రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు*......
ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నెల-16 నుంచి 23 మధ్య తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.ఆదిలాబాద్,మంచిర్యాల,నిజామాబాద్,జగిత్యాల,కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 15,16 తేదీల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఏపీలోని ఉత్తర కోస్తా,యానాం ప్రాంతాల్లో ఆదివారం నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది.


Comments
Post a Comment